IPL 2025: ఫస్ట్ టైం పంత్ పై పాజిటివ్ గా మాట్లాడిన ఊర్వశి రౌతేలా! ఎందుకో తెలుసా?
ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ ఫామ్‌లో లేకపోయినా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అతడిపై ఈసారి సానుకూల వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో వీరిద్దరి మధ్య చర్చనీయాంశమైన కోల్డ్ వార్ తర్వాత, ఇప్పుడు ఊర్వశి పంత్ జట్టుకు మద్దతు ప్రకటించింది. పంత్‌తో పని చేయాలనుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కొత్త వ్యాఖ్యలతో వీరి మధ్య సంబంధం మళ్లీ ప్రారంభమవుతుందా? అన్నదానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పేరుతో వార్తల్లోకి ఎక్కింది. గతంలో వీరిద్దరి మధ్య డేటింగ్ సంబంధం ఉందన్న వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. పంత్‌ను ఉద్దేశిస్తూ ఊర్వశి తరచూ సెటైరికల్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈసారి మాత్రం ఊర్వశి పంత్‌పై నెగటివ్ కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరిలోనూ చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2025లో తాను లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మద్దతు ఇస్తున్నానని, వాళ్లే గెలవాలని కోరుకుంటున్నానని ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అంతేకాదు, లక్నోతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా తాను సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది. ఊర్వశి లక్నో జట్టుకు మద్దతు ఇస్తున్నానంటేనే ఆశ్చర్యంగా ఉంది, కానీ దీనికి అసలైన కారణం రిషభ్ పంత్. ఎందుకంటే ఐపీఎల్ 2025లో లక్నో జట్టుకు పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. కానీ ఈ సీజన్‌లో పంత్ ఫామ్‌లో లేకపోవడం, అతని జట్టు కూడా సరైన ఆటతీరును చూపకపోవడం వల్ల సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. పంత్ మాత్రం బ్యాట్‌తో పూర్తిగా విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలు అవుతున్నాడు. అతడికి పెట్టిన రూ.27 కోట్లు వృథా అయిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇటీవల ఊర్వశి రౌతేలా తన కొత్త చిత్రం “జాట్” ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంగా, యాంకర్ పంత్‌తో యాడ్ చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా, “నేను సూర్యకుమార్ యాదవ్‌తో సహా అనేక మంది క్రికెటర్లతో పని చేశాను. కానీ పంత్‌తో మాత్రం ఎప్పుడూ పనిచేయలేదు. భవిష్యత్తులో చేస్తానో లేదో చెప్పలేను. అంతా స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది” అంటూ తెలివిగా, కొంచెం సిగ్గు పడుతూ స్పందించింది. దీంతో మళ్లీ ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ఊర్వశి–పంత్ మధ్య సోషల్ మీడియాలో విమర్శలు, సెటైర్లు కొనసాగాయి. ఒక సందర్భంలో పంత్ తన కోసం హోటల్‌లో వేచి ఉన్నాడని ఊర్వశి చెప్పగా, పంత్ మాత్రం “పాపులారిటీ కోసం కొందరు ఎన్ని అబద్ధాలైనా చెబుతారు, దయచేసి నన్ను వదిలేయండి” అంటూ తేలికపాటి గుసగుసలతో స్పందించాడు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఊర్వశి “బ్యాట్ బాల్‌తో ఆడుకో చిట్టి తమ్ముడూ. రాఖీ శుభాకాంక్షలు” అంటూ ఎమోషనల్‌గా, సెటైరికల్‌గా రిప్లై ఇచ్చింది.
ఇక ఇప్పుడు పంత్‌ను మళ్లీ తన మాటల్లో ప్రస్తావిస్తూ, అతడితో కలిసి పనిచేయాలనుందని చెప్పడం ద్వారా ఊర్వశి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. గతం ఎంతగా కలతలతో ఉన్నా, ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య సంబంధం మరో మలుపు తీసుకుంటుందా? అన్నదానిపై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..