AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. అంబానీ, అదానీల సరసన రిషభ్ పంత్! తక్కువోడేం కాదు..

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉత్తరాఖండ్‌లో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా నిలిచారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. మహారాష్ట్రలో ముకేశ్ అంబానీ, గుజరాత్‌లో గౌతమ్ అదానీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, పంత్ కూడా భారీగా ట్యాక్స్ చెల్లిస్తూ సంచలనం సృష్టించారు.

వామ్మో.. అంబానీ, అదానీల సరసన రిషభ్ పంత్! తక్కువోడేం కాదు..
Mukesh Ambani Rishabh Pant And Adani
SN Pasha
|

Updated on: Sep 06, 2026 | 11:20 AM

Share

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్ ఆడే పోటుగాడు, వికెట్ల వెనుక పాదరసంలా కదిలే ఆటగాడు, ఆఫ్ ది ఫీల్డ్‌లో చెలాకీ కుర్రాడు.. వీటితో పాటు సంపదలో కూడా తోపు అవుతున్నాడు. సంపద అంటే ఏదో సాదా సీదా అనుకునేరు ఏకంగా అంబానీ, అదానీల సరసన నిలుస్తున్నాడు. అంటే వారి అంత సంపాదిస్తున్నాడని కాదు కానీ ఒక్క విషయంలో వారితో సమానంగా ఉన్నాడు. ఆ కథేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

దేశంలో అత్యధిక పన్నులు చెల్లించే వ్యక్తులు, కంపెనీలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఎవరు ఎంత ట్యాక్స్ కడుతున్నారనే విషయాన్ని సాధారణ ప్రజలుగా తెలుసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. దేశవ్యాప్తంగా చాలా మంది అధిక మొత్తంలో ట్యాక్స్ కడుతున్నా.. రాష్ట్రాల పరంగా చూస్తూ.. రాష్ట్రానికి ఒక అత్యధిక ట్యాక్స్ పేయర్ ఉంటారు. ఆ లెక్కన మహారాష్ట్రలో ముఖేష్ అంబానీ, గుజరాత్ రాష్ట్రానికి గౌతమ్ అదానీ అనుకుంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మన రిషభ్ పంత్. ఓ యంగ్ క్రికెటర్ ఓ రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నాడంటే చిన్న విషయం ఏం కాదు. అయితే పంత్ ఏడాది ఎన్ని కోట్లు ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. అతని సంపద ఎంత అనే మరింత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

పంత్ ఎంత ట్యాక్స్ కడుతున్నాడు?

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో రూ.23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి రాష్ట్రంలో అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా నిలిచారని ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వెల్లడించారు. గత ఏడాది ఆయన సుమారు రూ.10.5 కోట్లు పన్ను చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. పంత్ ఆదాయ వనరుల్లో BCCI కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులు, IPL, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి.

మహారాష్ట్రలో ముకేశ్ అంబానీ

మహారాష్ట్రకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. ఆయన సుమారు రూ.637 కోట్ల పన్ను చెల్లిస్తున్నారని సమాచారం. అంబానీ ఆదాయం రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో, రిలయన్స్ రిటైల్, పెట్రోకెమికల్స్, ఆయిల్-టు-కెమికల్స్, డిజిటల్ సర్వీసెస్, మీడియా, న్యూ ఎనర్జీ వంటి వ్యాపారాల నుంచి వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోని అతిపెద్ద పన్ను చెల్లించే కంపెనీల్లో ఒకటి. ఆర్థిక సంవత్సరం 2022-23లో RIL ప్రభుత్వం వద్ద సుమారు రూ.20,376 కోట్ల పన్నులు చెల్లించింది.

గుజరాత్‌లో గౌతమ్ అదానీ

గుజరాత్‌కు సంబంధించి గౌతమ్ అదానీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన కంపెనీ సుమారు రూ.74,945 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో మొత్తం అదానీ గ్రూప్ చేసిన గ్లోబల్ ట్యాక్స్, ఇతర ఎక్స్చెకర్ కాంట్రిబ్యూషన్. ఇందులో ప్రత్యక్ష పన్నులు రూ.28,720 కోట్లు, పరోక్ష పన్నులు రూ.45,407 కోట్లు, ఇతర చెల్లింపులు రూ.818 కోట్లు ఉన్నాయి. అదానీ గ్రూప్ వ్యాపారాల్లో పోర్టులు, పవర్, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, సిటీ గ్యాస్, సిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్‌పోర్టులు తదితర రంగాలు ఉన్నాయి.

Follow Us