AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 మంది ప్రాణాలు తీసిన కల్తీ మద్యం.. తాగే ముందు కచ్చితంగా ఇవి తెలుసుకోండి!

నాగాలాండ్‌లో దారుణం వెలుగు చూసింది. కల్తీ మద్యం తాగి దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది హాస్పిటల్‌ పాలయ్యారు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 19 మందిని అరెస్ట్ చేసి, దాదాపు 3వేల మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

19 మంది ప్రాణాలు తీసిన కల్తీ మద్యం.. తాగే ముందు కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
Spurious Liquor Kills 19 In Nagaland
Anand T
|

Updated on: Sep 26, 2026 | 4:33 PM

Share

కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందిన ఘటన నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్, టుయెన్‌సాంగ్ జిల్లాల్లో వెలుగు చూసింది. రెండ్రోజు వ్యవధిలో కల్తీ మద్యం తాగడం కారణంగా మోకోక్‌చుంగ్ జిల్లాలో 8 మంది, టుయెన్‌సాంగ్ జిల్లాలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మరణాలకు కారణమైన కల్తీ మద్యం అసలు మూలాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ బృందానికి అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐ బుంగ్లాంగ్ చాంగ్ నాయకత్వం వహిస్తారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వేసుప్ర కేజో పీటీఐకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు కొన్ని ఆధారాలు లభించాయని.. కానీ పూర్తి ఆధారాలు లేకుండా వివరాలు వెల్లడించడం తొందరపాటు అవుతుందని తెలిపారు. మరణాలకు గల కారణాలను నిర్ధారించేందుకు మద్యం శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. రిపోర్ట్ వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.

పోలీసుల సూచనలు

ఈ ఘటన నేపథ్యంలో జనాలకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. సర్టిఫైడ్‌ కాని, లేబుల్స్‌ లేని అక్రమంగా తరలించే మద్యాన్ని ఎవరూ పొరపాటున కూడా తాగవద్దని.. అటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహించాలని సూచించారు. మద్యం సేవించిన తర్వాత ఎవరికైనా తల తిరగడం, దృష్టి మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సంరక్షణ పొందాలని కూడా వారు కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us