AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: తొలిసారి హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన పంత్.. భావోద్వేగంతో ట్వీట్.. ఏమన్నాడంటే?

Indian Cricket Team: డిసెంబరు 30న రూర్కీకి వెళుతుండగా రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యాడు. అందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని మొదట డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి, ఆపై ముంబైకి తీసుకెళ్లారు.

Rishabh Pant: తొలిసారి హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన పంత్.. భావోద్వేగంతో ట్వీట్.. ఏమన్నాడంటే?
Rishabh Pant
Venkata Chari
|

Updated on: Feb 07, 2023 | 8:47 PM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఉత్కంఠ పీక్స్‌లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సిరీస్‌లో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. డిసెంబర్ 30 న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఈ సిరీస్‌లో ఆడడం లేదు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందు, పంత్ తన పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చాడు. ఇది భారతీయ అభిమానులను చాలా సంతోషపరుస్తుంది.

ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన పంత్ ఫిబ్రవరి 7, మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఇది ప్రమాదం తర్వాత అతను మొదటిసారి ఆసుపత్రి గది నుంచి బయటకు వచ్చినట్లు చూపిస్తుంది. పంత్ ఈ ఫొటోతో బయట కూర్చుని స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం చాలా బాగుందని ఎప్పుడూ అనుకోలేదంటూ కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

అభిమానులకు కృతజ్ఞతలు..

ఇటీవలి కాలంలో పంత్ నుంచి వచ్చిన రెండవ కీలక అప్‌డేట్ ఇది. కొన్ని రోజుల క్రితం, పంత్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం బాగున్నానని చెప్పుకొచ్చాడు. అభిమానుల ప్రార్థనలకు పంత్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ప్రమాద సమయంలో సహాయం కోసం వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, రిషబ్ పంత్‌కు రెండు మోకాళ్లలో లిగమెంట్‌లకు శస్త్రచికిత్స చేయడంతో తిరిగి మైదానంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా పంత్ IPL 2023 ఆడలేడు. ఆ తర్వాత కూడా అతను తిరిగి రావడంపై స్పష్టత లేదు.

Pant Tweet

Pant Tweet

ముంబైలో కొనసాగుతున్న చికిత్స..

ప్రమాదం తర్వాత పంత్‌ను రూర్కీలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ కొన్ని రోజుల చికిత్స అనంతరం బీసీసీఐ వైద్య బృందం సలహా మేరకు ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకెళ్లి మోకాలికి శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి పంత్ ఆసుపత్రిలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..