Team India: గిల్ వర్సెస్ సిరాజ్.. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు.. చిచ్చు పెట్టిన ఐసీసీ.. ఎందుకంటే?
Shubman Gill vs Mohammed Siraj: ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ మధ్య పోటీ నెలకొంది. అలాగే డెవాన్ కాన్వే కూడా రేసులో ఈ ఇద్దరితో పోటీపడుతున్నాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మధ్య పోరు మొదలైంది. అయితే, ఇది మైదానంలో కాదండోయ్.. ఇది ఐసీసీ అవార్డుల వేటలో పోటీ పడుతున్నారు. వాస్తవానికి, ఈ ఇద్దరు ఆటగాళ్లు మంగళవారం ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేషన్లు అందుకున్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ఫార్మాట్లలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ అవార్డు రేసులో మూడో ఆటగాడిగా నిలిచాడు.
గత నెలలో రెండు వైట్-బాల్ ఫార్మాట్‌లలో గిల్ అద్భుతంగా రాణించాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో సిరాజ్ కొత్త బంతితో వన్డేల్లో అనూహ్యంగా రాణించాడు. ముంబైలో శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో గిల్ ఆడాడు. అందులో అతను ఏడు పరుగులు మాత్రమే చేశాడు. మూడవ మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను మూడు వన్డేల్లో 70, 21, 116 పరుగులు చేశాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అతను 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 28 పరుగులు చేయలేకపోయారు.
డబుల్ సెంచరీ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్..
వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా శుభ్‌మన్ నిలిచాడు. ఆ తర్వాత అతను తదుపరి రెండు ఇన్నింగ్స్‌లలో 40, 112 నాటౌట్‌గా నిలిచాడు. అతను 360 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక స్కోరు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.
సిరాజ్ నంబర్ వన్..
View this post on Instagram
మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సిరాజ్ ఏడు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో మూడు, నాలుగు వికెట్లు తీశాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండవ మ్యాచ్‌లో ఆరు ఓవర్లలో కేవలం పది పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. అతను 21 మ్యాచ్‌లు ఆడిన తర్వాత మాత్రమే మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇది భారత చరిత్రలో ఏ బౌలర్‌కైనా అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
ఇప్పుడు సిరాజ్, శుభ్‌మన్ గిల్‌లలో ఎవరికి ఈ అవార్డు లభిస్తుందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సిరీస్ గురువారం నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..