చదువులో జీరో.. క్రికెట్‌లో హీరో.. సెన్సేషనల్‌ సెంచరీతో సింగ్‌ ఈజ్‌ కింగ్‌ అనిపించుకున్న కేకేఆర్‌ ప్లేయర్

యూపీకి చెందిన రింకూసింగ్‌ చదువులో చాలా పూర్‌. 9వ తరగతి కూడా దాటలేకపోయాడు. అయితే చదువులో జీరో అయిన రింకూ సింగ్.. క్రికెట్‌లో ఎంత పెద్ద హీరోనో చెప్పడానికి తాజాగా నాగాలాండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచే నిదర్శనం.

చదువులో జీరో.. క్రికెట్‌లో హీరో.. సెన్సేషనల్‌ సెంచరీతో  సింగ్‌ ఈజ్‌ కింగ్‌ అనిపించుకున్న కేకేఆర్‌ ప్లేయర్
Rinku Singh

Updated on: Dec 21, 2022 | 6:01 PM

IPL 2022 సీజన్‌లో ఎంతోమంది యువ ఆటగాళ్ల వెలుగులోకి వచ్చారు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. అలాంటి యంగ్‌ ప్లేయర్లలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూసింగ్‌ కూడా ఒకడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ప్లేయర్‌ తన దూకుడైన బ్యాటింగ్‌, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. యూపీకి చెందిన రింకూసింగ్‌ చదువులో చాలా పూర్‌. 9వ తరగతి కూడా దాటలేకపోయాడు. అయితే చదువులో జీరో అయిన రింకూ సింగ్.. క్రికెట్‌లో ఎంత పెద్ద హీరోనో చెప్పడానికి తాజాగా నాగాలాండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రింకూ 146 బంతుల్లో అజేయంగా 127 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రింకూ సింగ్‌కు ఇది ఆరో సెంచరీ. రింకూ సెంచరీ కారణంగా యూపీ తన తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 551 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

ఆరుగురు బౌలర్లను చితక బాది..

కాగా ఈ మ్యాచ్‌లో బంతిని అందుకున్న ప్రతి బౌలర్‌ను చితగ్గొట్టాడు రింకూ. అత్యధికంగా ఆకాశ్‌ సింగ్‌ బౌలింగ్‌లో 58 పరుగులు చేశాడు. ఆతర్వాత జొనాథన్ బౌలింగ్‌లో 37 రన్స్‌ చేశాడు. ఇతర బౌలర్లపై 20 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్‌లో 49 సింగిల్స్, 13 డబుల్స్ ఉన్నాయి.అలాగే 13 సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. యూపీ భారీస్కోరు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నాగాలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆ జట్టు ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 44 పరుగులకే 6 వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో యూపీ ఇన్నింగ్స్‌ విజయానికి చేరువలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..