AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 స్ట్రైక్‌రేట్‌తో 74 రన్స్‌.. 3 క్యాచ్‌లు.. ఫినిషర్‌గా అదరగొడుతోన్న లేడీ ధోని.. భారత్‌కు రెండో ప్రపంచకప్‌ అందించేనా?

టీమ్ ఇండియా విజయాల్లో వికెట్‌ కీపర్‌ అండ్‌ స్టార్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కీలక పాత్ర పోషిస్తోంది. లేడీ ధోనిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి జట్టులో తన ఫినిషర్‌ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేస్తుంది.

150 స్ట్రైక్‌రేట్‌తో 74 రన్స్‌.. 3 క్యాచ్‌లు.. ఫినిషర్‌గా అదరగొడుతోన్న లేడీ ధోని.. భారత్‌కు రెండో ప్రపంచకప్‌ అందించేనా?
Richa Ghosh
Basha Shek
|

Updated on: Feb 16, 2023 | 1:03 PM

Share

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా టీమ్ ఇండియా విజయాల్లో వికెట్‌ కీపర్‌ అండ్‌ స్టార్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ కీలక పాత్ర పోషిస్తోంది. లేడీ ధోనిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి జట్టులో తన ఫినిషర్‌ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రిచా మొత్తం 74 పరుగులు చేసింది. కీపర్‌గా 3 క్యాచ్‌లు అందుకుంది. మొదట పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 31 పరుగులు చేసింది రిచా . దీంతో పాటు రెండు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఒక స్టంపింగ్ కూడా చేసింది. ఇక బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అజేయంగా 44 పరుగులు చేసింది. ఒక క్యాచ్ కూడా అందుకుంది. ఇలా రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భతంగా ఆడి నాటౌట్‌గా నిలిచిందీ లేడీ ధోని. అంతేకాదు ఈ టోర్నీలో రిచా స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది.

కాగా బెంగాల్ వాసి అయిన రిచా.. టీమిండియా రెండో ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటోంది. గత నెలలో, ఆమె అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాలో సభ్యురాలు. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం దక్కింది. కాగా ఇటీవల జరిగిన వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ టీమిండియా ధనాధన్ వికెట్ కీపర్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే.. చివరికి ఈ లేడి ధోనిని రూ. 1.90 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?
అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?
ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే..
ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే..
వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక 24 గంటల్లోనే..
వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక 24 గంటల్లోనే..
ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?
ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?
బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన 'తలా'
బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన 'తలా'
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచితే ధనం, శాంతి పెరుగుతాయా?
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచితే ధనం, శాంతి పెరుగుతాయా?