AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement Buzz in Indian Cricket: అశ్విన్ బాటలో ఆ ముగ్గురు.. టీమిండియా లెజెండ్స్ రిటైర్ కాబోతున్నారా?

భారత జట్టులో సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ పై గుసగుసలు పెరుగుతున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తరువాత, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ టెస్టుల నుంచి తప్పుకునే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు జట్టులో కొత్త రక్తానికి మార్గం సుగమం చేయవచ్చుని జోరుగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Retirement Buzz in Indian Cricket: అశ్విన్ బాటలో ఆ ముగ్గురు.. టీమిండియా లెజెండ్స్ రిటైర్ కాబోతున్నారా?
Rohit Sharma Virat Kohli
Narsimha
|

Updated on: Dec 19, 2024 | 3:31 PM

Share

భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఈ మేటి బౌలర్ ఇకపై టెస్ట్ జట్టులో భాగంగా ఉండరని స్పష్టం చేశారు.

ప్రస్తుతం భారత జట్టులో అనేక మంది ఆటగాళ్లు తమ కెరీర్ ముగింపు దశలో ఉన్నందున, బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత మరికొంత మంది ఆటగాళ్లు టెస్టుల నుండి రిటైర్ కావడం ఆశ్చర్యంగా లేదు. ఈ నేపధ్యంలో, సిరీస్‌లో చివరి టెస్ట్‌కి జట్టు సిద్ధమవుతుండగా, రిటైర్ అయ్యే అవకాశం ఉన్న ముగ్గురు ఆటగాళ్లు వీరంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి టెస్టుల నుండి రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు? విరాట్ కోహ్లి భారత అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. టెస్టుల్లో భారత జట్టును ముందుండి నడిపిస్తూ ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, 2020 నుండి టెస్టుల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు 31కి కిందగా ఉండటం ఆయన ప్రతిభకు తగినది కాదనే చెప్పవచ్చు. ఈసారి బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ కూడా కోహ్లి జ్ఞాపకంగా ఉంచుకునే విధంగా లేదు, పర్త్ టెస్టులో చేసిన సెంచరీ మినహా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తన దారుణమైన ఫామ్, వయసు దృష్ట్యా కోహ్లి టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని సోసల్ మీడియాలో ఒకరకమైన బజ్ క్రియోట్ అయింది.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు? ఈ సంవత్సరం టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ ప్రయాణం బాగా ఒడిదుడుకుల మధ్య సాగింది. ఇంగ్లాండ్‌లో సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేసిన రోహిత్, తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గత పదిమంది టెస్టు ఇన్నింగ్స్‌లలో రోహిత్ సగటు 12కి పైగా మాత్రమే ఉండటం గమనార్హం, అంతేకాకుండా ఒకే ఒక్క అరవై పరుగుల ఇన్నింగ్స్ ఉంది. 37 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్, బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ ముగిసిన తరువాత టెస్టులకు గుడ్‌బై చెప్పడం సముచితంగా భావించే అవకాశం ఉంది.

మొహమ్మద్ షమీ

మొహమ్మద్ షమీ టెస్టుల నుండి రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు? భారత జట్టు అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన మొహమ్మద్ షమీ టెస్టుల్లో ఎన్నో విజయాలను సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లలో తన ప్రభావాన్ని చూపించారు. అయితే, 2023 హోం వరల్డ్‌కప్‌ తర్వాత షమీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆయన ఫిట్‌నెస్ సమస్యలు, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ బౌలర్ల కెరియర్ దృష్ట్యా, షమీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.