AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ప్రాక్టీస్‌లో గాయపడిన సెంచరీల ప్లేయర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సన్నాహాలు ప్రారంభించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న శిబిరంలో ఢిల్లీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

IPL 2023: ప్రాక్టీస్‌లో గాయపడిన సెంచరీల ప్లేయర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్..
Sarfaraz Khan Ipl 2023
Venkata Chari
|

Updated on: Feb 26, 2023 | 6:42 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సన్నాహాలు ప్రారంభించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న శిబిరంలో ఢిల్లీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలో ఆ జట్టు ఆటగాడు గాయపడిన వార్త ఆందోళన కలిగిస్తోంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ క్యాంపులో ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో అతను ఇరానీ కప్‌నకు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో తలపడే ఇరానీ కప్‌లో అతను రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడాల్సి ఉంది.

ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ పాల్గొనలేదని వార్తా సంస్థ పీటీఐ తన నివేదికలో పేర్కొంది. ఇరానీ కప్ మ్యాచ్ మార్చి 1 నుంచి గ్వాలియర్‌లో జరగనుంది. గాయం కారణంగా, సర్ఫరాజ్ తన వేలికి ఫైబర్ కాస్ట్ ధరించాడు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేయలేదు. అయితే, అతను తన సహచరులకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేస్తున్నాడు. సర్ఫరాజ్ ఈ సీజన్‌లో ఆరు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. 92 సగటుతో 556 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ వచ్చింది.

పంత్ ప్లేస్‌లో సర్ఫరాజ్‌కు ఆ బాధ్యతలు..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ కారణంగా, అతను ఐపీఎల్ తదుపరి సీజన్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో పంత్ స్థానంలో సర్ఫరాజ్ వికెట్ కీపర్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. సర్ఫరాజ్‌కు ఎనిమిది నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇటువంటి పరిస్థితిలో ఢిల్లీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే సర్ఫరాజ్ గాయం తీవ్రంగా ఉంటే ఢిల్లీకి ఇబ్బంది ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్..

మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో మయాంక్ అత్యధిక పరుగులు చేశాడు. అతని జట్టు కర్ణాటక సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. కానీ, టైటిల్ మ్యాచ్‌కు చేరలేకపోయింది. ఈ మ్యాచ్ ముందుగా ఇండోర్‌లో జరగాల్సి ఉంది. అయితే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అందుకే ఈ మ్యాచ్ గ్వాలియర్‌కు మార్చారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరగాల్సి ఉండగా మైదానం సిద్ధం కాకపోవడంతో ఇండోర్‌కు మార్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత గ్వాలియర్‌లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరగనుంది.

షా, మయాంక్‌లపైనే అందరి చూపు..

దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన మైదానమే గ్వాలియర్‌లోని రూప్ సింగ్ స్టేడియం. ఈ మైదానంలో ముంబైకి చెందిన యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు టెస్ట్‌లలో భారత్‌కు ఓపెనర్‌గా ఉండాల్సి ఉంది. కానీ పేలవమైన ఫామ్ కారణంగా, ఇద్దరూ జట్టు నుంచి దూరమయ్యారు.

రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్ – మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), సుదీప్ కుమార్ ఘర్మి, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హార్విక్ దేశాయ్, ముఖేష్ కుమార్, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్కండే, సౌరభ్ కుమార్, , బాబా ఇంద్రజిత్, పుల్కిత్ నారంగ్, యష్ ధుల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..