AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: హర్భజన్ లేదా సెహ్వాగ్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎవరు? ఒకే ఒక్క షరతుతో ఓకే అన్న మాజీ బౌలర్..

BCCI Selection Committee: మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వివాదం తర్వాత రాజీనామా చేయడంతో గత 10 రోజులుగా బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్ట్ ఖాళీగా ఉంది.

BCCI: హర్భజన్ లేదా సెహ్వాగ్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎవరు? ఒకే ఒక్క షరతుతో ఓకే అన్న మాజీ బౌలర్..
Harbhajan Singh
Venkata Chari
|

Updated on: Feb 26, 2023 | 8:08 PM

Share

భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీకి కొత్త హెడ్ ఎవరు? అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా నడుస్తోంది. గత నెలలో చీఫ్ సెలెక్టర్‌గా మారిన చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో అనేక వివాదాస్పద ప్రకటనల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, ఐదుగురు సభ్యులతో కూడిన సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ లేకుండా నడుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త చీఫ్ సెలక్టర్‌గా ఎవరిని నియమిస్తుందోనని అందరూ ఆసక్తిగా మారింది. ఇంతలో హర్భజన్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు భారత మాజీ స్పిన్నర్‌ను అడిగినప్పుడు, అతను బహిరంగంగా ఒక షరతును ముందుకు తెచ్చాడు.

కొన్నేళ్ల క్రితం వరకు, దిలీప్ వెంగ్‌సర్కార్, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్‌నాథ్, కిరణ్ మోర్ వంటి అనుభవజ్ఞులైన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ గత కొన్నేళ్లుగా 2-3 టెస్టులు ఆడిన అనుభవం లేక చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

‘కోచ్‌తో సమానమైన జీతం’..

ఇంగ్లీష్ వార్తాపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ను చీఫ్ సెలెక్టర్ కావడం గురించి ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు హర్భజన్ భవిష్యత్తులో ఇది జరగవచ్చని, అయితే దీనికి జీతం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో కోచ్‌కి, సెలెక్టర్‌కి సమాన వేతనం లభిస్తుందో లేదో చూద్దాం అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. కోచ్ ఎల్లప్పుడూ జట్టుతో ఉండాలి. ప్రణాళికలు వేయాలి. కానీ, జట్టు ఎంపిక కూడా అంతే ముఖ్యం కదా అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

సెలక్టర్లకు, ప్రధాన కోచ్‌కు బీసీసీఐ అందజేసే జీతంలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వార్షిక వేతనం రూ.7 కోట్లు. సెలక్షన్ కమిటీ అధినేతకు ఏడాదికి కోటి రూపాయలు లభిస్తుండగా, కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.90 లక్షలు ఉందంట.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..