AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వ్కాడ్‌లో తోపులున్నా.. వరుసగా 4 ఓటములెందుకు.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే!

India vs England T20 series: ఏదైనా ఒక జట్టు నిరంతరం విజయాలు సాధించాలంటే ఆటగాళ్ల మధ్య సమన్వయంతో పాటు మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయాలు కూడా పారదర్శకంగా ఉండాలి. ఇప్పటికైనా కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు పక్షపాత ధోరణిని వీడి, జట్టులో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే రాబోయే రోజుల్లో భారత క్రికెట్ మరింత ఇబ్బందుల్లో పడటం ఖాయం.

స్వ్కాడ్‌లో తోపులున్నా.. వరుసగా 4 ఓటములెందుకు.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే!
Ind Vs Eng Series
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 1:45 PM

Share

Why India Losing Matches: ఒకప్పుడు టీ20 క్రికెట్‌లో ఓటమి ఎరుగని రారాజులా వెలిగిన భారత జట్టు, ఇప్పుడు వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మన తోపులు, ఇప్పుడు ఒకే ఒక్క విజయం కోసం తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోవడానికి దారితీసిన ఆ మూడు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తిగా విఫలమవుతున్న బ్యాటింగ్ లైనప్..

గడిచిన రెండేళ్లలో టీమిండియా సాధించిన విజయాల్లో బ్యాటింగ్ విభాగమే కీలక పాత్ర పోషించింది. కానీ ప్రస్తుత విదేశీ పర్యటనలలో మన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. క్రీజులోకి రావడం, పెవిలియన్‌కు క్యూ కట్టడం అన్నట్లుగా సాగుతోంది వారి ఆటతీరు. ఓపెనర్లు ఇద్దరూ జట్టుకు కనీస ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవడానికే ఇబ్బంది పడుతున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతారహితమైన షాట్లతో వికెట్లను పారేసుకుంటున్నారు. అందరూ కలిసికట్టుగా విఫలమవడంతో జట్టు భారీ స్కోర్లు సాధించలేక కుప్పకూలుతోంది.

నాయకుడిగా విఫలమైన శ్రేయస్ అయ్యర్..

భారతీయ లీగ్ క్రికెట్‌లో కోల్‌కతా జట్టును విజేతగా నిలిపి, అద్భుతమైన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్.. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. అతని సారథ్యంలోనే భారత్ ఈ వరుస నాలుగు పరాజయాలను మూటగట్టుకుంది. మైదానంలో సరైన వ్యూహాలు రచించలేకపోవడమే కాకుండా, కనీసం బ్యాట్‌తోనైనా జట్టును ముందుండి నడిపించలేకపోతున్నాడు. ఒకవైపు కెప్టెన్సీ ఒత్తిడి, మరోవైపు పేలవమైన ఫామ్ కారణంగా కనీసం అసలు అతనికి టీ20 జట్టులో చోటు అవసరమా? అనేంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

డ్రెస్సింగ్ రూమ్‌లో గందరగోళం..

టీమిండియా వరుస ఓటములకు కేవలం ఆటతీరు మాత్రమే కాదు, జట్టు అంతర్గత వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడమే కారణమని స్పష్టమవుతోంది. ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాడిని అకస్మాత్తుగా జట్టుకు దూరం చేయడం ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు సిరీస్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన సంజూ శాంసన్‌కు కేవలం మూడు ఇన్నింగ్స్‌ల ఆధారంగా తుది జట్టు నుంచి వేటు వేయడం తీవ్ర వివాదాస్పదమైంది. రాబోయే జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని పక్కన పెట్టడం గమనార్హం. నిలకడగా విఫలమవుతున్న కొందరిని మాత్రం జట్టులో కొనసాగిస్తూ, ప్రతిభ ఉన్నవారిని తొక్కేస్తున్నారనే భావన ఆటగాళ్లలో అసంతృప్తిని రగిలిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!
స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?
గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు
గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు
4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?
4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
అర్ధరాత్రి బీసీసీఐ సంచలన నిర్ణయం.. శాంసన్‌కు కీలక బాధ్యతలు..?
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
పేదోళ్ల ఇంట్లో ఈ వంటకానికే మొదటి స్థానం.. ఒక్క ముద్ద తింటే చాలు
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
నెట్టింట గత్తరలేపుతున్న మొగలిరేకులు సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..