RCB vs PBKS: ఇక నేను కూడా మొదలెడతా..! మ్యాచ్‌కి ముందు పంజాబ్‌కు భువీ మాస్ వార్నింగ్! ఇది కదా కావాల్సింది..
RCB, 6 మ్యాచ్‌లలో 4 గెలిచి, రెండు ఓడిపోయింది. సొంత మైదానంలో ఓడిపోవడం వారిపై ఒత్తిడి పెంచుతోంది. పంజాబ్ కింగ్స్ అయితే, తాజా విజయంతో ధీమాతో ఉంది. భువనేశ్వర్ కుమార్, సలైవా వాడటం ప్రారంభిస్తానని ప్రకటించాడు, ఇది బౌలింగ్‌కు సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. ఈ మ్యాచ్ ఫలితం ఆసక్తికరంగా ఉంటుంది.

ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు (ఏప్రిల్ 18, శుక్రవారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 4 మ్యాచ్‌లు గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఇందులో విశేషం ఏంటంటే.. గెలిచిన 4 మ్యాచ్‌లు కూడా అవే గేమ్స్‌లోనే గెలిచింది. ఓడిన రెండు మ్యాచ్‌లు కూడా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోనే ఓడిపోయింది. సో.. ఒక రకంగా ఇది ఆర్సీబీపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. సొంత గ్రౌండ్‌లో, తమ అభిమానుల మధ్య మ్యాచ్ కచ్చితంగా గెలవాలనే ప్రెజర్ ఆర్సీబీపై చాలా బలంగా ఉంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ మరిలోకి దిగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అతి చిన్న టార్గెట్ (111)ను రక్షించుకొని.. కేకేఆర్‌పై సూపర్ విక్టరీ అందుకొని, ఇప్పుడు ఆర్సీబీపై ఆడేందుకు సిద్ధమైంది.
ఇలా పంజాబ్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వస్తున్న సమయంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భుమనేశ్వర్ కుమార్ పంజాబ్ కింగ్స్‌కు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు తాను సలైవా వాడలేదని, ఇప్పటి నుంచి కచ్చితంగా ఉపయోగిస్తానంటూ స్పష్టం చేశాడు. కోవిడ్ కారణంగా బాల్‌పై సలైవ్ పూయడాన్ని బీసీసీఐ, ఐసీసీ నిషేధించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సీజన్ నుంచి బాల్‌పై సలైవా వాడొచ్చని బీసీసీఐ అనుమతించింది. దీంతో బౌలర్లకు కాస్త హెల్ప్ లభిస్తుంది. సలైవా బాల్‌పై పూయడంతో బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ సలైవా వాడి అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఓవర్ ఓవర్‌లో మ్యాచ్ గెలిపించాడు.
సో.. స్టార్క్‌ను చూసిన తర్వాత తాను కూడా సలైవా వాడలని ఫిక్స్ అయినట్లు భువీ తెలిపాడు. అసలే స్వింగ్ కింగ్‌గా పేరున్న భువీ, బాల్‌ను మరింత స్వింగ్ చేసేందుకు సలైవా వాడుతా అని చెప్పడంతో పంజాబ్ కింగ్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భువీ మాట్లాడుతూ.. “నేను సలైవా వాడలేదు. దాన్ని వాడవచ్చని మర్చిపోయాను. స్టార్క్ ని చూడగానే, నేను సలైవా వాడాలని గుర్తుకు వచ్చింది. అది నాకు సహాయపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ తదుపరి మ్యాచ్ లో నేను కచ్చితంగా దాన్ని వాడతాను.” అని పేర్కొన్నాడు. మరి చూడాలి పంజాబ్‌తో మ్యాచ్‌లో భువీ సలైవా వాడితే అది ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటుందో చూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




