IPL 2025: ఏంటి బ్రో అంత మాట అన్నావ్.. 300 స్కోర్‌పై SRHను దారుణంగా ట్రోల్ చేసిన అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో దారుణమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, ముంబైతో మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో సన్‌రైజర్స్ ను ట్రోల్ చేశాడు. ప్లేఆఫ్స్ చేరుకోవడం కష్టమైన పరిస్థితి లో, మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాడ్ ఫామ్ కొనసాగుతోంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి.. 5వ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 6 మ్యాచ్‌లు గెలవాలి. లేదా 5 గెలిచినా రన్‌రేట్ ఆధారంగా ఛాన్స్ ఉండొచ్చు. ప్రస్తుతం జట్టు ఫామ్ చూస్తుంటే.. 7లో 5 మ్యాచ్‌లు గెలవడం అంత ఈజీ కాదు. మ్యాచ్ విషయం పక్కనపెడితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో దారుణంగా ట్రోల్ చేశాడు.
మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. ఎస్‌ఆర్‌హెచ్ పరువుతీసేలా ఒక కామెంట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కి ముందు నితీష్ కుమార్ రెడ్డి “ప్రిపేరింగ్ ఫర్ 300” అంటూ ఒక ట్వీట్ చేశాడు. కానీ, మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఫేలవ ప్రదర్శన కనబర్చింది. స్లో పిచ్‌పై మన బ్యాటింగ్ తేలిపోయింది. జట్టు మొత్తం కలిపి 162 పరుగులు మాత్రమే చేశారు. అభిషేక్ శర్మ 40, క్లాసెన్ 37 పరుగులతో రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ట్రావిస్ హెడ్ 29 బంతుల్లో 28, ఇషాన్ కిషన్ 2, నితీస్ కుమార్ రెడ్డి 19 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యారు. చివర్లో అనికేత్ శర్మ ఓ రెండు సిక్సులు కొట్టడంతో స్కోర్ ఆ మాత్రం అయినా వచ్చింది. లేదంటే 150 లోపలే ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ క్లోజ్ అయ్యేది.
ఈ స్కోర్ చూసిన తర్వాత అంపైర్ రిచర్డ్ ఒక ట్వీట్ చేశారు. నితీష్ చేసిన 300 ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. 162 ఇప్పుడు కొట్టారు, ఏప్రిల్ 23న మళ్లీ ముంబైతో జరిగే మ్యాచ్‌లో ఇంకో 138 కొడితే.. 300 వచ్చేస్తుందని సరదాగా ట్వీట్ చేశాడు. సరదా సరదాగానే ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు. గురువారం ముంబైతో తొలి మ్యాచ్‌న సన్‌రైజర్స్.. మళ్లీ ఈ నెల 23న ఉప్పల్ వేదికగా మ్యాచ్ ఆడనుంది. మన హోం గ్రౌండ్‌లో ముంబైని ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి.. 23న ఎస్‌ఆర్‌హెచ్ ఎలా ఆడుతుందో.
162 against MI (Yesterday) 138 against MI (23rd April) —— 300 ✅ —— https://t.co/ADTw7mEqJD
— Richard Kettleborough (@RichKettle07) April 17, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




