AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs KKR IPL 2026 : రాయ్‌పూర్‌లో శాంతించిన వరుణుడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైనా, పూర్తి ఓవర్ల పాటు సాగనుంది. ఈ మ్యాచులో వరుణ్ ఆడడం లేదు.

RCB vs KKR IPL 2026 : రాయ్‌పూర్‌లో  శాంతించిన వరుణుడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
Rcb Vs Kkr
Rakesh
|

Updated on: May 13, 2026 | 8:38 PM

Share

RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాయ్‌పూర్‌ వేదికగా ఒక ఆసక్తికర పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో టాస్ వేయడంలో జాప్యం జరిగింది. మైదానం అంతా కవర్లతో కప్పి ఉంచినప్పటికీ, వర్షం తగ్గడంతో రాత్రి 8:30 గంటలకు టాస్ వేశారు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకోగా, అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగుతోంది.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించి 14 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా ఆర్‌సీబీ నిలుస్తుంది. రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు చాలా సంయమనంతో, పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అయితే వరుసగా గత రెండు మ్యాచ్‌ల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సున్నాకే అవుట్ అవ్వడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. అయినప్పటికీ 11 మ్యాచ్‌ల్లో 379 రన్లతో కోహ్లీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు.

మరోవైపు మూడుసార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ వరుసగా నాలుగు విజయాలతో రేసులోకి వచ్చింది. టోర్నీ మధ్యలో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ, రహానే నేతృత్వంలో అద్భుతమైన పునరాగమనం చేసింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కేకేఆర్‌కు ప్రతి మ్యాచ్ కీలకమే. ముఖ్యంగా సునీల్ నరైన్, రింకూ సింగ్ వంటి హిట్టర్లపై జట్టు ఆశలు పెట్టుకుంది.

రాయ్‌పూర్ అవుట్‌ఫీల్డ్ వర్షం వల్ల కాస్త తడిగా ఉంది. అయితే గ్రౌండ్ స్టాఫ్ శ్రమించి మైదానాన్ని సిద్ధం చేశారు. మ్యాచ్ నిర్ణీత 20 ఓవర్ల పాటు జరగనుంది. రాత్రి 8:45 గంటలకు మొదటి బంతి పడనుంది. పిచ్‌పై కాస్త తేమ ఉండే అవకాశం ఉన్నందున ఆరంభంలో బౌలర్లకు సహకరించవచ్చు. అందుకే టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ చేసి కోల్‌కతాను తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ప్లాన్ చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
భారత్, ఐర్లాండ్ రెండు దేశాల తరఫునా ఆడిన తెలుగు క్రికెటర్
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ.. అధికారిక ప్రకటన
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
నిమిషం గ్యాప్‌లో రెండు భారీ భూకంపాలు.. కుప్పకూలిన భారీ భవనాలు..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
మృగశిర ముగిసినా కానరాని వాన జాడ.. ఆకాశం వైపు ఆశగా రైతన్నల చూపులు
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
ఆకాష్ దీప్ కోసం అంత త్యాగం చేసిన అమ్మాయి ఎవరంటే ?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్.. ఏమైందంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అబ్బా సాయిరాం.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?