IPL 2025: ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ ఎప్పుడు? లైవ్ స్టీమింగ్ కోసం ఎక్కడ చూడాలంటే..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ అన్‌బాక్స్ ఈవెంట్‌ను మార్చి 17న మధ్యాహ్నం 3:30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనుంది. విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్ళు, కన్నడ గాయకులు, రాపర్లు పాల్గొంటారు. ఈ ఈవెంట్‌ను RCB యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రూ.99 చెల్లించి లైవ్‌గా చూడవచ్చు. IPL 2025 సీజన్ ఈ నెల 22 నుండి ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ కొత్త జెర్సీలను లాంచ్ చేశాయి. అలాగే ఐపీఎల్‌లోనే అత్యంత భారీ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం తమ జెర్సీని ఇప్పటికే రివీల్ చేసింది. అయితే.. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అన్‌బాక్స్ ఈవెంట్ చేయనున్నారు. చాలా మంది ఈ ఈవెంట్‌ను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్ లైవ్ చూడాలంటే ఎలా? ఈ ఈవెంట్‌లో ఎవరెవరు పాల్గొంటున్నారు. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల సమక్షంలో ఈ అన్‌బాక్స్ ఈవెంట్ జరగనుంది.
ఈ ఈవెంట్లో సిక్స్-హిటింగ్ ఛాలెంజ్ కూడా ఉంది. అలాగే కన్నడ సింగర్స్ సంజిత్ హెగ్డే, ఐశ్వర్య రంగరాజన్, రాపర్ ఆల్ ఓకేల లైవ్ ప్రదర్శనలు కూడా ఉన్నాయి. హనుమాన్‌కింద్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ మార్చి 17 అంటే సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను ఆర్సీబీ యాప్, లేదా వెబ్‌సైట్‌లో లైవ్ చూడొచ్చు. అయితే అందుకోసం రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా , భువనేశ్వర్ కుమార్ , లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్, నువాన్ తుసార, లుంగి ఎన్‌గిడి , జితేష్ శర్మ, యశ్ దయాల్, రసిఖ్ ధర్, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్ పాల్గొననున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఒక్కడ క్లిక్ చేయండి.