AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: నితిన్ ‘రాబిన్ హుడ్’ కోసం డేవిడ్ భాయ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?

ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో బ్యాట్ తో ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించిన అతను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపించనున్నాడు. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్రలో నటించాడు.

David Warner: నితిన్ 'రాబిన్ హుడ్' కోసం డేవిడ్ భాయ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?
David Warner
Basha Shek
|

Updated on: Mar 17, 2025 | 10:37 AM

Share

పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు కూడా ఫేవరెట్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైపోయాడు. అలాగే తెలుగు సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్ కి రీల్స్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ అభిమానం సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున పుష్ప సినిమాకు వార్నర్ చేసిన రీల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో చాలామంది అభిమానులు అతనిని సినిమాల్లో నటించాలని కోరారు. ఈ కోరిక ఇప్పుడు నెరవేరనుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో మాత్రమే కనిపించిన డేవిడ్ భాయ్ ఇప్పుడు వెండితెరపైనా దర్శనమివ్వనున్నాడు. నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో ఈ ఆసీస్ క్రికెటర్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫ్రమ్ బౌండరీ టూ బాక్సాఫీస్.. తెలుగు సినిమాకు స్వాగతం డేవిడ్ వార్నర్’ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఆ పోస్టర్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారోనని నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కాగా రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ భాయ్ సుమారు నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఆయన రూ.3 కోట్లు పారితోషకంగా అందుకున్నాడని టాక్. అలాగే సినిమా ప్రమోషన్స్ లో సైతం పాల్గొనడం కోసం అదనంగా రూ.కోటి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.

ఇవి కూడా చదవండి

కాగా భీష్మ తర్వాత మరోసారి వెంకీ కుడుముల తో జత కట్టారు నితిన్. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. అలాగే వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, దేవదత్తా నాగ, షైన్ టామ్ చాకో, ఆడుకలం నరేన్, మైమ్ గోపి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మంకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో నితిన్, శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..