ఒకే ఒక్క పరుగు.. లక్కంటే వీళ్లదే

|

Apr 22, 2019 | 12:19 PM

ఐపీఎల్ 12వ సీజన్ లో బెంగళూరు జట్టు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు చివరి బంతికి చెన్నైపై విజయం సాధించింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (53; 37 బంతుల్లో […]

ఒకే ఒక్క పరుగు.. లక్కంటే వీళ్లదే
Follow us on

ఐపీఎల్ 12వ సీజన్ లో బెంగళూరు జట్టు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు చివరి బంతికి చెన్నైపై విజయం సాధించింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (53; 37 బంతుల్లో 2×4, 4×6) జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ (2/25), రవీంద్ర జడేజా (2/29), బ్రావో (2/34) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టుకు కెప్టెన్‌ ధోని (84 నాటౌట్‌; 48 బంతుల్లో 5×4, 7×6) ఒంటరి పోరాటం చేసినా.. మరోవైపు వికెట్లు పడుతుండడంతో జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. దీనితో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.