AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: 97 బంతుల్లో 20 సిక్సర్లు.. 236 స్ట్రైక్‌రేట్‌తో 229 పరుగులు.. ఐపీఎల్ చరిత్రలో భారీ రికార్డ్.. ఎవరో తెలుసా?

On This Day In IPL 2016: ఏడేళ్ల క్రితం అంటే ఈ రోజు (మే 14) IPL 2016లో, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ 229 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

IPL: 97 బంతుల్లో 20 సిక్సర్లు.. 236 స్ట్రైక్‌రేట్‌తో 229 పరుగులు.. ఐపీఎల్ చరిత్రలో భారీ రికార్డ్.. ఎవరో తెలుసా?
Rcb Virat And Ab D
Venkata Chari
|

Updated on: May 14, 2023 | 2:42 PM

Share

Highest Partnership In IPL History: ఐపీఎల్ హిస్టరీలో అతిపెద్ద భాగస్వామ్యం రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉంది. 7 ఏళ్ల క్రితం అంటే 2016లో ఈ రోజు (మే 14) ఐపీఎల్‌లో అతిపెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డును ఇద్దరు ఆటగాళ్లు సృష్టించారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్‌పై తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడి ఈ రికార్డు సృష్టించారు.

ఐపీఎల్ 2016లో గుజరాత్‌పై ఏబీ, విరాట్ రెండో వికెట్‌కు 229 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో ఇద్దరి బ్యాట్‌ల నుంచి మొత్తం 20 సిక్సర్లు నమోదయ్యాయి. వీరిద్దరి భాగస్వామ్యం స్ట్రైక్ రేట్ 236.08గా నిలిచింది. కేవలం 97 బంతుల్లోనే కోహ్లి, డివిలియర్స్ ఈ ఘనత సాధించారు.

ఇవి కూడా చదవండి

కోహ్లి, డివిలియర్స్ ఇద్దరూ సెంచరీలు..

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3.5 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి క్రిస్ గేల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.

ఏసీ డివిలియర్స్ 248.08 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 52 బంతుల్లో అజేయంగా 129 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో, విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 198.18గా నిలిచింది.

ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పరుగుల ఛేదనలో గుజరాత్ లయన్స్ 18.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆర్సీబీ 144 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్ బెంగళూరులో జరిగింది.

ఐపీఎల్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్ నంబర్ వన్ స్థానంలో ఉంది. 2017లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 146 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..