AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB: కోహ్లీ టీంకు బిగ్ మ్యాచ్ మాత్రమే కాదు.. 11 ఏళ్ల చరిత్ర రిపీట్ కావాల్సిందే.. లేదంటే.. లీగ్ నుంచి ఫసక్..

Rajasthan Royals vs Royal Challengers Bangalore: IPL 2023లో ఇప్పటివరకు జైపూర్‌లో 4 మ్యాచ్‌లు జరిగాయి. ఆ నాలుగింటిలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రన్ ఛేజింగ్ టీమ్ కూడా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

RR vs RCB: కోహ్లీ టీంకు బిగ్ మ్యాచ్ మాత్రమే కాదు.. 11 ఏళ్ల చరిత్ర రిపీట్ కావాల్సిందే.. లేదంటే.. లీగ్ నుంచి ఫసక్..
Rr Vs Rcb
Venkata Chari
|

Updated on: May 14, 2023 | 2:07 PM

Share

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కోటలోకి చొచ్చుకుపోయేందుకు చాలా జట్లు జైపూర్ చేరుకున్నాయి. కొన్ని జట్లు మాత్రమే విజయాలు అందుకోగా.. మరికొందరికి నిరాశే ఎదురైంది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్‌లో తదుపరి నంబర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెంతకు చేరింది. సంజూ శాంసన్ అండ్ కోతో తలపడేందుకు విరాట్ కోహ్లీ సేన సిద్ధంగా ఉంది. మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకం. ఇటువంటి పరిస్థితిలో జైపూర్ మైదానంలో బెంగళూరు జట్టు గత 11 సంవత్సరాలుగా చేయని పనిని చేయవలసి ఉంటుంది.

ఐపీఎల్ 2023లో ఇరు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. అంతకుముందు బెంగళూరులో ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్‌లో RCB 7 పరుగుల తేడాతో గెలిచింది. వడ్డీతో సహా తమ ఖాతాలను తిరిగి పొందేందుకు రాజస్థాన్ రాయల్స్‌కు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. జైపూర్‌లో గెలిస్తే.. ఆర్‌సీబీ ఓటమితో ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశ కూడా సన్నగిల్లుతుంది.

RCB 11 ఏళ్ల చరిత్ర పునరావృతం చేసేనా..

ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ ప్లాన్‌పై నీళ్లు చల్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కారును ముందుకు తీసుకెళ్లాలంటే, జైపూర్‌లో 11 ఏళ్ల చరిత్రను పునరావృతం చేయాల్సి ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరిగా 2012 సంవత్సరంలో జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఐపీఎల్ 2023లో బెంగళూరు అదే ఫీట్‌ను పునరావృతం చేయాల్సి ఉంది.

IPLలో RCB vs RR..

ఐపీఎల్ పిచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇది ​​30వ పోరు. అంతకుముందు ఆడిన 29 మ్యాచ్‌ల్లో బెంగళూరు 14 సార్లు గెలుపొందగా, రాజస్థాన్ 12 సార్లు గెలిచింది. అదే సమయంలో చివరి 5 మ్యాచ్‌లలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3-2 ఆధిక్యంలో ఉంది.

రెండు జట్ల ప్లేఆఫ్ సమీకరణం..

ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం విషయానికొస్తే, ఆ కోణంలో చూస్తే ఈ మ్యాచ్‌లో గెలుపు, ఓటమి చాలా ముఖ్యం. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌లలో 10 పాయింట్లను కలిగి ఉంది. రాజస్థాన్‌తో ప్లస్ పాయింట్ ఏమిటంటే, దాని రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉంది. RCB విజయంతోపాటు రన్‌రేట్‌పై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంది.

ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు జైపూర్‌లో 4 మ్యాచ్‌లు జరిగాయి. ఆ నాలుగింటిలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా రన్ ఛేజింగ్ టీమ్ కూడా 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. జైపూర్‌లో టాస్ పెద్ద అంశం కాదు.