AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 226 : ఈ సారి ఆర్‌సీబీదే కప్పు? 10 ఏళ్ల క్రితం నాటి సీన్ రిపీట్.. భువీ కొట్టిన ఆ సిక్సరే సాక్ష్యం

IPL 226 : ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ 10 ఏళ్ల తర్వాత సిక్సర్ బాదడంతో ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలుస్తుందనే సెంటిమెంట్ బలపడుతోంది. 2016లో హైదరాబాద్ జట్టు తరపున ఉన్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో కూడా భువీ అగ్రస్థానంలో ఉండటమే దీనికి కారణం.

IPL 226 : ఈ సారి ఆర్‌సీబీదే కప్పు? 10 ఏళ్ల క్రితం నాటి సీన్ రిపీట్.. భువీ కొట్టిన ఆ సిక్సరే సాక్ష్యం
Bhuvneshwar Kumar
Rakesh
|

Updated on: May 11, 2026 | 9:55 AM

Share

IPL 226 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఇది కచ్చితంగా పూనకాలు తెప్పించే వార్తే. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత గణాంకాలు. మే 10న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆర్‌సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బ్యాట్‌తో మెరిసి ఒక సిక్సర్ బాదాడు. ఈ ఒక్క సిక్సర్ వెనుక 10 ఏళ్ల నాటి ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ దాగి ఉంది. అదే ఇప్పుడు ఆర్‌సీబీని మళ్ళీ విజేతగా నిలబెట్టబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏమిటా 10 ఏళ్ల నాటి వింత సెంటిమెంట్?

భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో సిక్సర్ కొట్టడం చాలా అరుదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2016లో భువీ ఒక సిక్సర్ బాదాడు. అప్పట్లో ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో ఉన్నాడు. విశేషం ఏంటంటే.. ఆ ఏడాది భువీ సిక్సర్ కొట్టడమే కాకుండా.. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. ఫలితంగా ఆ సీజన్‌లో ఆయన ఉన్న జట్టు (SRH) టైటిల్ కొట్టింది. ఇప్పుడు సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2026లో మళ్ళీ అదే సీన్ కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌పై భువీ కొట్టిన సిక్సర్ మ్యాచ్ మలుపు తిప్పడమే కాకుండా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసింది.

పర్పుల్ క్యాప్ కూడా భువీ దగ్గరే

కేవలం సిక్సర్ మాత్రమే కాదు, వికెట్ల వేటలో కూడా భువీ టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో భువనేశ్వర్ కుమార్ 11 మ్యాచ్‌లలో 21 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో కూడా ఆయన పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నప్పుడే ఆయన జట్టు విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా భువీ పర్పుల్ క్యాప్‌తో ఉండటం, సిక్సర్ బాదడం.. ఈ రెండు యాధృచ్ఛికాలు ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్‌ను ముద్దాడబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.

హిస్టరీ రిపీట్ అయితే ఆర్‌సీబీదే కప్పు

ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది. భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లో ఉండటం, దానికి తోడు ఈ 10 ఏళ్ల సెంటిమెంట్ తోడవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఒకవేళ ఆర్‌సీబీ ఈ ఏడాది కూడా ట్రోఫీ నెగ్గితే, ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్ల జాబితాలో చేరుతుంది. భువీ వేసే స్వింగ్ బంతులు, బ్యాట్‌తో చూపిస్తున్న మెరుపులు ఆర్‌సీబీకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు
16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు
అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే?
అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే?