PSL 2025: ఐపీఎల్‌లోనే కాదు.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ మనదే డామినేషన్! ఆర్సీబీనా మజాకా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ఏ కకాలంలో జరుగుతున్న నేపథ్యంలో, రెండు టోర్నమెంట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తాజాగా, పీఎస్‌ఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులు కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన IPL, PSL ల మధ్య ఉన్న పోటీని మరింతగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చింది.
Updated on: Apr 17, 2025 | 5:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియాలో జరుగుతుండగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ పాకిస్తాన్‌లో జరుగుతోంది. ఒకే సమయంలో రెండు లీగ్‌లు జరుగుతుండటంతో, ఏ టోర్నమెంట్ అత్యుత్తమమనే దానిపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చల మధ్య RCB అభిమానులు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కనిపించారు.

కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన పీఎస్‌ఎల్ 6వ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో ఇద్దరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు కావడం గమనార్హం.

మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఆర్‌సిబి జెర్సీలు ధరించి కనిపించిన వారిద్దరి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేదా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఏది బెస్ట్ అనే ప్రశ్నకు ఈ ఫోటో సమాధానం అని చాలా మంది స్పందించారు.

అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఆర్సీబీ అభిమానులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2024 పీఎస్‌ఎల్ మ్యాచ్‌లో పెషావర్ జల్మి, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించిన అభిమాని కనిపించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరాచీ కింగ్స్ కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లాహోర్ ఖలందర్స్ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.




