AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Ashwin: రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతను క్రికెట్ ద్వారా బాగానే సంపాదించాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న అశ్విన్ ఐపీఎల్, ప్రకటనల ద్వారా భారీగానే ఆస్తులు కూడ బెట్టాడు.

R Ashwin: రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
Ravichandran Ashwin
Basha Shek
|

Updated on: Dec 18, 2024 | 9:32 PM

Share

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ గ్రేటెస్ట్ స్పిన్నర్.. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే అశ్విన్ ఇకపై టీమ్ ఇండియా జెర్సీలో కనిపించడన్నమాట. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న అశ్విన్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో 3వ టెస్టులో రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అంతుకు ముందు మొదటి టెస్టులోనూ తుది జట్టులో స్థానం దక్కలేదు. దీంతో తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు అశ్విన్. తన నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చిన అశ్విన్.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే టెస్టు క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే అశ్విన్.. టీమిండియా తరఫున టెస్టుల్లో 500లకు పైగా వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ మైదానంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అశ్విన్.. సంపాదనలో కూడా వెనకడుగు వేయలేదు. అశ్విన్ మొత్తం సంపద 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం అశ్విన్‌కు మొత్తం రూ.132 కోట్ల ఆస్తులున్నాయి.

క్రికెట్‌తో పాటు ప్రకటనల ద్వారా కూడా రవిచంద్రన్ అశ్విన్ చాలా సంపాదిస్తున్నాడు. ఇది కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ గ్రేడ్ ప్లేయర్‌గా ఉన్న అశ్విన్ బీసీసీఐ నుంచి ప్రతి ఏటా రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే ఐపీఎల్‌లో కూడా అశ్విన్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న అశ్విన్ ఒక్కో ఎడిషన్‌కు రూ.5 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు తన సొంతగడ్డ జట్టులో చేరిన అశ్విన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక్కో ఎడిషన్‌కు రూ.9.75 కోట్లు చెల్లించనుంది.

ప్రకటనల ద్వారా కూడా భారీగా ఆదాయం..

ఇది కాకుండా, స్పేస్‌మేకర్స్, కోకో స్టూడియో తమిళ్, బాంబే షేవింగ్ కంపెనీ, మన్నా ఫుడ్స్, అరిస్టోక్రాట్ బ్యాగ్స్, మైంత్రా, ఒప్పో, మూవ్, డ్రీమ్ 11 ప్రకటనల ద్వారా అశ్విన్ భారీగానే సంపాదిస్తున్నాడు. 1986 సెప్టెంబర్ 17న జన్మించిన అశ్విన్ చెన్నైలోని ఇంటి విలువ 9 కోట్లు. అదేవిధంగా అశ్విన్‌కి కూడా లగ్జరీ కార్లంటే ఇష్టం. అతని వద్ద లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఆడి క్యూ7 ఎస్‌యూవీ, రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. ఈ కారు ధర దాదాపు 6 కోట్లు ఉంటుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..