Rohit Sharma: ఇండియన్ క్రికెట్ లో తీవ్ర విషాదం.. మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత.. మరణానికి కారణమిదే

రాజస్థాన్‌ కు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (40) హఠాత్తుగా కన్నుమూశారు. రంజీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున చాలా మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నివేదికల ప్రకారం, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ నాలుగైదు రోజుల క్రితం నగర ఆసుపత్రిలో చేరాడు.

Rohit Sharma: ఇండియన్ క్రికెట్ లో తీవ్ర విషాదం.. మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత.. మరణానికి కారణమిదే
Rohit Sharma

Updated on: Mar 04, 2024 | 7:41 AM

రాజస్థాన్‌ కు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (40) హఠాత్తుగా కన్నుమూశారు. రంజీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున చాలా మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నివేదికల ప్రకారం, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ నాలుగైదు రోజుల క్రితం నగర ఆసుపత్రిలో చేరాడు. అక్కడే అతను చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో రోహిత్ కన్నుమూశాడు. రోహిత్ శర్మ మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫొటోను పోస్ట్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే రాజస్థాన్ రంజీ ప్లేయర్ అని క్లారిటీ రావడంతో హిట్ మ్యాన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్ తరపున ఏడు రంజీ మ్యాచ్ లతో పాటు 28 ODIలు ఆడాడు రోహిత్. ఈ మ్యాచ్‌ల్ రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలతో 35కి పైగా సగటుతో మొత్తం 850 పరుగులు చేశాడు. అంతేకాకుండా శర్మ నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆల్ రౌండర్, రోహిత్ తన బౌలింగ్‌లో ఆరు వికెట్లు కూడా సాధించాడు

2004 నుండి 2014 వరకు తన 10 సంవత్సరాల కెరీర్‌లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనలతో తరచుగా దృష్టిని ఆకర్షించాడు రోహిత్ శర్మ. ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, శర్మ కోచ్ కావాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఔత్సాహిక క్రికెటర్లకు నైపుణ్యాలను అందించడానికి జైపూర్‌లో RS క్రికెట్ అకాడమీని స్థాపించారు. అయితే ఇంతలోనే కాలేయ సమస్యల బారిన పడడం, ఆస్పత్రిలో చేరడం, హఠాత్తుగా కన్నుమూయడంతో క్రీడాలోకంలో తీవ్ర విషాదం అలుముకొంది. పలువురు రంజీ ప్లేయర్లు రోహిత్ శర్మ మృతికి సంతాపం ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..