AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB, IPL 2021 Highlights: బెంగళూరుదే విజయం.. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి

రాజస్థాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు టీం 17.1 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

RR vs RCB, IPL 2021 Highlights: బెంగళూరుదే విజయం.. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి
RR vs RCB
uppula Raju
| Edited By: |

Updated on: Sep 29, 2021 | 11:04 PM

Share

రాజస్థాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు టీం 17.1 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపిఎల్ 2021లో నేడు రాజస్థాన్  రాయల్స్ వర్సెస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరగనుంది. దుబాయ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైనది. ఎందుకంటే ఇందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్ బెర్త్‌కి వెళుతుంది. రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో సన్‌ రైజర్‌ హైదరాబాద్‌పై ఓటమి ఎదర్కొంది. రాయల్‌ ఛాలెంజర్స్ తన చివరి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌పై గెలిచి మంచి ఊపుమీదుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 10 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లను కలిగి ఉంది. అదే సమయంలో రాజస్తాన్ రాయల్స్  కూడా 8 మ్యాచ్‌ ఆడి 8 పాయింట్లను కలిగి ఉంది. అంటే, రెండు జట్లకు విజయంపై ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ అందించే విజయం ఈ రెండు జట్లలో మరింత విశ్వాన్ని పెంచుతాయి.

ఐపీఎల్ 2021 లో రాజస్తాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇది ​​రెండో పోరు. ప్రథమార్ధంలో ఇరు జట్లు మొదటిసారి తలపడ్డాయి. ఇందులో విరాట్ కోహ్లీ ఛాలెంజర్స్ హవా కొనసాగింది. ఇవాళ దుబాయ్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి. రెండు జట్ల మధ్య చివరి 5 మ్యాచ్‌ల గురించి మాట్లాడితే  ఐదు మ్యాచుల్లో కోహ్లీ జట్టు(RCB) నాలుగింటిలో గెలిచి ముందంజలో ఉంది. ఐపీఎల్ పిచ్‌లో రాజస్తాన్-బెంగళూరు 24 సార్లు తలపడ్డాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ 11 సార్లు, రాజస్తాన్ 10 సార్లు గెలిచాయి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Sep 2021 11:01 PM (IST)

    7 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం

    రాజస్థాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు టీం 17.1 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

  • 29 Sep 2021 10:56 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ

    భరత్ (44) రూపంలో ఆర్‌సీబీ 3వ వికెట్‌ను కోల్పోయింది. టీం స్కోర్ 127/3 వద్ద ముస్తఫిజర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. టీం విజయానికి 21 బంతులో 11 పరుగులు చేయాల్సి ఉంది.

  • 29 Sep 2021 10:39 PM (IST)

    13 ఓవర్లకు ఆర్‌సీబీ స్కోర్ 106/2

    13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు టీం 2 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. క్రీజులో మ్యాక్స్‌వెల్ 18, భరత్ 33 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 Sep 2021 10:02 PM (IST)

    50 పరుగులు దాటిన బెంగుళూర్

    బెంగుళూర్ 5 ఓవర్లకు 50 పరుగులు దాటింది. విరాట్ కోహ్లీ 20 పరుగులు, శ్రీకర్ భరత్ 3 పరుగులతోక్రీజులో ఉన్నారు. రాజస్తాన్‌ బౌలర్లలో ముస్తాఫిక్ రెహ్మాన్‌కి ఒక వికట్‌ దక్కింది.

  • 29 Sep 2021 10:02 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన బెంగుళూర్

    బెంగుళూర్ మొదటి వికెట్ కోల్పోయింది. దేవదత్ పటేల్ 22 పరుగులు ఔటయ్యాడు. ముస్తాఫికర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 48 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది.

  • 29 Sep 2021 09:40 PM (IST)

    బ్యాటింగ్ ప్రారంభించిన బెంగుళూర్

    150 పరుగుల లక్ష్యంతో బెంగుళూర్‌ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా దేవదత్ పటేల్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌లో 8 పరుగులు చేశారు.

  • 29 Sep 2021 09:21 PM (IST)

    20 ఓవర్లకు రాజస్థాన్ 149/9

    రాజస్థాన్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఓపెనర్ ఈవెన్‌ లూయిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. బెంగుళూరు బౌలింగ్‌లలో హర్షల్ పటేల్ 2, షహబాజ్‌ అహ్మద్ 2, యజ్వేంద్ర చాహల్‌ 1 వికెట్‌ సాధించారు. బెంగుళూర్‌ లక్ష్యం 150 పరుగులు.

  • 29 Sep 2021 09:17 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్

    రాజస్థాన్ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. క్రిస్‌ మోరిస్ 14 పరుగులు ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసింది.

  • 29 Sep 2021 09:00 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్

    రాజస్థాన్ ఆరో వికెట్‌ కోల్పోయింది. లియామ్ లివింగ్‌స్టన్ 3 పరుగులు ఔటయ్యాడు. చాహ్ల బౌలింగ్‌లో డివిలియర్స్‌ క్యాచ్ పట్టాడు. దీంతో రాజస్థాన్ 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజులోకి క్రిస్ మోరిస్ వచ్చాడు.

  • 29 Sep 2021 08:53 PM (IST)

    15 ఓవర్లకు రాజస్థాన్ 120/5

    రాజస్థాన్ 15 ఓవర్లకు 120 పరుగులు చేసింది. క్రీజులో లియామ్ లివింగ్‌స్టన్ 3 పరుగులు, రియాన్‌ పరాగ్‌ 1 పరుగుతో ఉన్నారు. బెంగుళూర్ బౌలర్లలో షహబాజ్‌ అహ్మద్ 2 వికెట్లు సాధించాడు. యజ్వేంద్ర చాహల్‌కి ఒక వికెట్‌ దక్కింది.

  • 29 Sep 2021 08:51 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్

    రాజస్థాన్ ఐదో వికెట్‌ కోల్పోయింది. రాహుల్‌ 2 పరుగులకు ఔటయ్యాడు. షహబాజ్‌ అహ్మద్ బౌలింగ్‌లో పాడిక్కల్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో రాజస్థాన్ 14.2 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. క్రీజులోకి రియాన్‌ పరాగ్‌ వచ్చాడు.

  • 29 Sep 2021 08:47 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్

    రాజస్థాన్ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్ సంజు శాంసన్ 19 పరుగులకు ఔటయ్యాడు. షహబాజ్‌ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించిన సంజు పాడిక్కల్‌కి చిక్కాడు. దీంతో రాజస్థాన్ 4 వికెట్లకు 115 పరుగులు చేసింది. క్రీజులోకి రాహుల్ వచ్చాడు

  • 29 Sep 2021 08:44 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్

    రాజస్థాన్ మూడో వికెట్‌ కోల్పోయింది. మహిపాల్ లోమ్రోర్ 3 పరుగులకే ఔటయ్యాడు. యజ్వేంద్ర చాహల్ ఓవర్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.

  • 29 Sep 2021 08:33 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్ రెండో వికెట్‌ కోల్పోయింది. ఏవిన్‌ లూయిస్ 58 పరుగులు ఔటయ్యాడు. జార్జ్‌ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాజస్థాన్ 11.2 ఓవర్లకు 102 పరుగులు చేసింది.

  • 29 Sep 2021 08:28 PM (IST)

    100 పరుగులు దాటిన రాజస్థాన్

    రాజస్థాన్ 11 ఓవర్లకు వంద పరుగులు దాటింది. క్రీజులో ఏవిన్‌ లూయిస్ 58 పరుగులతో, కెప్టెన్ సంజు శాంసన్ 10 పరుగులతో ఆడుతున్నారు.

  • 29 Sep 2021 08:21 PM (IST)

    లూయిస్ హాఫ్ సెంచరీ

    రాజస్థాన్ ఓపెనర్ ఏవిన్‌ లూయిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 3 సిక్స్‌లు, 5 ఫోర్లు బాదాడు. దీంతో రాజస్థాన్‌ 9.2 ఓవర్లకు 86 పరుగులతో కొనసాగుతోంది.

  • 29 Sep 2021 08:16 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌

    రాజస్థాన్ రాయల్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. యశస్వి జైశ్వాల్ 31 పరుగులకు ఔటయ్యాడు. లూయిస్ 46 క్రీజులో పరుగులతో ఉన్నాడు. రాజస్థాన్ 8.2 ఓవర్లకు 77 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ క్రీజులోకి అడుగుపెట్టాడు.

  • 29 Sep 2021 08:01 PM (IST)

    50 పరుగుల భాగస్వామ్యం

    రాజస్థాన్ ఓపెనర్లు ఏవిన్‌ లూయిస్, యశస్వి జైశ్వాల్ మంచి ఆరంభం ఇచ్చారు. 34 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. భారీ స్కో్రు దిశగా రాజస్థాన్ వెళుతోంది. బెంగుళూర్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.

  • 29 Sep 2021 07:58 PM (IST)

    హాఫ్ సెంచరీ దిశగా లూయిస్

    రాజస్థాన్ ఓపెనర్ ఏవిన్‌ లూయిస్ దాటిగా ఆడుతున్నాడు. 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. మరోవైపు యశస్వి జైశ్వాల్ నిలకడగా ఆడుతున్నాడు.

  • 29 Sep 2021 07:56 PM (IST)

    50 పరుగులు దాటిన రాజస్థాన్

    రాజస్థాన్ 5 ఓవర్లకు యాబై పరుగులు దాటింది. క్రీజులో యశస్వి జైశ్వాల్ 13 పరుగులతో, లూయిస్ 39 పరుగులతో ఆడుతున్నారు.

  • 29 Sep 2021 07:34 PM (IST)

    శివమ్‌ దుబే మళ్లీ మిస్‌

    దుబాయ్‌లో ఈరోజు జరిగే మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ప్లేయింగ్ XI ప్రకటించాయి. రాజస్థాన్, బెంగళూరులో రెండూ మార్పులు జరిగాయి. రాజస్థాన్ జట్టులో తిరిగి వస్తాడని భావించిన ఆటగాడు కనిపించలేదు. ఈ రోజు మ్యాచ్‌లో కూడా శివమ్ దుబేకి అవకాశం రాలేదు.

  • 29 Sep 2021 07:28 PM (IST)

    RCB మొదటగా బౌలింగ్‌ చేయడం ఐదోసారి

    టాస్ గెలిచిన ఆర్‌సిబి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. IPL 2021లో RCB మొదట బౌలింగ్ చేయడం ఇది 5 వ సారి. ఇందులో 2 మ్యాచ్‌లు గెలిచాడు 2 ఓడిపోయాడు. అయితే మొదటగా 6 మ్యాచ్‌లలో బ్యాటింగ్‌ చేశాడు. ఇందులో 4 మ్యాచ్‌లు గెలిచాయి. 2 ఓడిపోయాయి. ఈరోజు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

  • 29 Sep 2021 07:23 PM (IST)

    టాస్ గెలిచిన విరాట్

    ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో బెంగుళూర్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అంటే రాజస్థాన్‌ రాయల్స్‌ మొదటగా బ్యాటింగ్‌ చేయనుంది

Published On - Sep 29,2021 7:09 PM