IPL 2021: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది అతడేనా.? ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా టీ20 స్టార్ ప్లేయర్.!

IPL 2021: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించడం ఇదే చివరిసారి. ఈ సీజన్ తర్వాత నుంచి ఆ జట్టు కెప్టెన్సీ..

IPL 2021: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది అతడేనా.? ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా టీ20 స్టార్ ప్లేయర్.!
Virat Kohli
Follow us

|

Updated on: Sep 29, 2021 | 3:51 PM

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించడం ఇదే చివరిసారి. ఈ సీజన్ తర్వాత నుంచి ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు కాస్త నిరాశ చెందినా.. ఆ జట్టుకు నెక్ట్స్ సీజన్‌లో కెప్టెన్‌గా ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఏబీ డివిలియర్స్ పేరు వినిపిస్తున్నా.. వయసు రీత్యా అతడు సరైన ఎంపిక కాదని మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే వచ్చే సీజన్‌కు ముందు మెగా ఆక్షన్ జరగనుంది. దీనితో తాజాగా బెంగళూరు జట్టుకు ఈ ముగ్గురులో ఒకరు కెప్టెన్‌ కానున్నడని అటు క్రికెట్ విశ్లేషకులు, ఇటు మాజీ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు. వాళ్లెవరో కాదు.. కెఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్.. సన్‌రైజర్స్ టీంను ఛాంపియన్‌గా నిలబెట్టడం కాకుండా.. ప్రతీ సీజన్‌లోనూ ఆ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్రను పోషిస్తూ వచ్చాడు డేవిడ్ వార్నర్. ఒక్క సీజన్ ఫెయిల్ అయిన మాత్రాన వార్నర్‌ను తక్కువ అంచనా వేయకూడదని.. రోజు తనదైనప్పుడు తానేంటో నిరూపించుకోగలడని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే వార్నర్‌కు కూడా మాజీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ఒకవేళ మెగా ఆక్షన్‌లో వార్నర్‌ను సన్‌రైజర్స్ జట్టు వదులుకుంటే.. కోహ్లీ టీంకు సరిగ్గా సరిపోతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

కెఎల్ రాహుల్.. ప్రతీ సీజన్‌లోనూ పంజాబ్ కింగ్స్‌కు అత్యధిక రన్స్ చేసే ఆటగాడు. అటు కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. టీంకు అవసరమైనప్పుడు తన చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆర్సీబీ నుంచి వచ్చిన రాహుల్.. మెగా ఆక్షన్‌లో ఉంటే ఖచ్చితంగా బెంగళూరు జట్టు కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తుందని సీనియర్ ప్లేయర్ డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. అటు ఫ్యాన్స్ కూడా రాహుల్‌కే ఓటు వేస్తున్నారు. మ్యాక్స్‌వెల్.. అంతర్జాతీయ జట్టుకు సారధ్యం వహించిన అనుభవం మ్యాక్స్‌వెల్ సొంతం.. అలాగే పంజాబ్ జట్టులో ఉన్నప్పుడు కూడా కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీనితో మ్యాక్స్‌వెల్‌కు కూడా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు అందుతున్నాయి.

Also Read:

ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..

చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!

‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
యానిమల్‌ సినిమా పై విద్యాబాలన్‌ సంచలన కామెంట్స్
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన సూర్య .. తిలక్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. డబ్బే డబ్బు
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
నారా రోహిత్‌ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన 'రాబిన్‌ హుడ
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ గెలుచుకోవచ్చు
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
సిల్వర్ స్క్రీన్ అంతా రామ నామమే.. 2024 రానున్న సినిమాలు ఇవే
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
డార్లింగ్ నే నమ్ముకుంటున్న హీరోయిన్లు.! ప్రభాస్ మ్యాజిక్ అలాంటిది
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
ఫ్యాన్స్ గెట్ రెడీ..పుష్ప 2 నుంచి మరో పవర్ ఫుల్ టీజర్..ఎప్పుడంటే?
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!
దూరమైంది నేనే..! నా సినిమాలు కాదు అంటున్న పవన్‌ కళ్యాణ్.!