IND vs ENG: లీడ్స్ టెస్ట్‌కు వర్షం ఎఫెక్ట్.. రెండు రోజులే మ్యాచ్ జరిగేనా?
India vs England Leeds Weather Forecast: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20 నుంచి లీడ్స్‌లో ప్రారంభమవుతుంది. AccuWeather.com ప్రకారం, లీడ్స్‌లో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి, మూడవ రోజులలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ, రెండవ, నాల్గవ, ఐదవ రోజులలో వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను ప్రభావితం చేస్తుంది.

భారత్, ఇంగ్లాండ్ (India vs England) మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20న ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ లీడ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. భారత బౌలింగ్ బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగానికి చాలా అనుభవం ఉంది. కాబట్టి, రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ మొదటి మ్యాచ్‌కు వర్షం భయం ఉంది. AccuWeather.com నివేదిక ప్రకారం, జూన్‌లో లీడ్స్‌లో వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో ఏ రోజు వర్షం పడుతుందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఐదు రోజుల వాతావరణ నివేదిక..
మొదటి రోజు వర్షం పడే అవకాశం 5 నుంచి 10 శాతం ఉంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 17 డిగ్రీలు, కనిష్టంగా 31 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. రెండవ రోజు అంటే జూన్ 21న వర్షం పడే అవకాశం 60 శాతం ఉంది. దీని కారణంగా, ఈ రోజు ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. మూడవ రోజు వర్షం పడే అవకాశం 5 నుంచి 10 శాతం ఉంది. అంటే మూడవ రోజు మ్యాచ్ ఎటువంటి సమస్యలు లేకుండా జరుగుతుంది.
అయితే, నాల్గవ రోజు వర్షం పడే అవకాశం 25-30% ఉంది. అందువల్ల, ఈ రోజు వర్షం ఆటకు అంతరాయం కలిగించవచ్చు. ఐదవ, చివరి రోజు కూడా వర్షం పడే అవకాశం 25-30% ఉంది. ఇటువంటి పరిస్థితిలో, భారీ వర్షం పడితే, మ్యాచ్ డ్రా కావచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్ డ్రా అయితే, అది రెండు జట్ల విజయ శాతాన్ని ప్రభావితం చేస్తుంది.
టీం ఇండియా రికార్డులు పేలవం..
హెండిగ్లాట్‌లో టీం ఇండియా రికార్డు అంత బాగా లేదు. ఈ మైదానంలో టీం ఇండియా మొత్తం 7 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలినవి డ్రా అయ్యాయి. మరోవైపు, భారత్, ఇంగ్లాండ్ మధ్య మొత్తం 136 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో, భారత్ 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లాండ్ 51 టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచింది. మిగిలినవి 50 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




