IPL 2025: దక్షిణాఫ్రికా క్రికెట్‌లో కలకలం! బ్యాన్ చేసిన డ్రగ్స్ వాడిన GT మెయిన్ బౌలర్! ఇక IPL కి డౌటే?
దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడను నిషేధిత డ్రగ్ వాడినందుకు క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ పరిణామం గుజరాత్ టైటాన్స్ IPL 2025 సీజన్‌కు పెద్ద దెబ్బగా మారింది. అంతేకాదు, రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రబాడ ప్రాతినిధ్యం పై కూడా అనుమానాలు ఉన్నాయి. రబాడ తన ప్రకటనలో క్రికెట్‌కు త్వరగా తిరిగివస్తానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ అయిన కగిసో రబాడను నిషేధిత డ్రగ్ వాడిన కారణంగా క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం క్రికెట్ ప్రపంచాన్ని కలిచివేసింది. మొదటగా, వ్యక్తిగత కారణాలనంటూ ఐపీఎల్ 2025 సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రబాడ లీగ్ నుంచి తప్పుకున్నాడు. కానీ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఆయన వినోద ఔషధాన్ని ఉపయోగించిన విషయంపై వచ్చిన ప్రతికూల విశ్లేషణాత్మక ఫలితాల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ (SACA) ద్వారా విడుదల చేయబడింది. అయితే, ఈ సస్పెన్షన్ ఎంతకాలం అమలులో ఉండబోతుందన్నది ఇంకా తెలియరాలేదు.
ఈ పరిణామం కేవలం IPL 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద దెబ్బే కాకుండా, జూన్ 11న జరగనున్న అతి ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌కు కూడా అతని ప్రాతినిధ్యంపై తీవ్రమైన అనుమానాలు తలెత్తేలా చేసింది. క్రికెట్‌కు తిరిగి రాలేకపోతే దక్షిణాఫ్రికా జట్టుకు అది పెద్ద లోటే అవుతుంది. తన ప్రకటనలో రబాడ “ఈ పరిణామం వల్ల నిరాశకు గురిచేసినందుకు మన్నించండి. నేను క్రికెట్‌ను ఎప్పటికీ తేలికగా తీసుకోను. నా బాధ్యతను తెలుసుకున్నాను, త్వరలో పోటీ క్రికెట్‌కు తిరిగి రావాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
అతని ప్రకటనలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా, గుజరాత్ టైటన్స్, తన ఏజెంట్‌లు, SACA, తన లీగల్ టీం అందించిన మద్దతుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన తన కెరీర్‌ను నిర్వచించదని, తాను కష్టపడి తిరిగి వచ్చి బలంగా రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగతానని ధైర్యంగా వెల్లడించారు. అయితే రబాడ వాడిన డ్రగ్ ఏదన్నది ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. అదే విధంగా, ఆ ఔషధాన్ని ఆయన ఎప్పుడు, ఎలా వాడారు అనే అంశాలు కూడా ఇంకా స్పష్టత పొందలేదు.
ఇదే సమయంలో, గుజరాత్ టైటన్స్ జట్టుకు ఇది తీవ్రమైన పరిణామంగా నిలిచింది. సీజన్ మధ్యలో కీలక బౌలర్‌ను కోల్పోవడం జట్టుకు వ్యూహాత్మకంగా దెబ్బతీసే అవకాశం ఉంది. రబాడ గతంలో దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో గన్ బౌలర్‌గా రాణించడమే కాక, IPLలో కూడా చాలా విజయవంతమైన ప్రయాణం కొనసాగించడంలో ముందు వరుసలో ఉన్నాడు. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఔషధ వివాదం అతని కెరీర్‌ను అటుపటు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. క్రికెట్ ప్రపంచం మొత్తం అతని పునరాగమనాన్ని ఆసక్తిగా గమనిస్తోంది.
Kagiso Rabada confirms in a statement through South Africa’s players union that he is currently serving a provisional suspension after testing positive for a recreational drug pic.twitter.com/gUd9Uu1Vhu
— Ali Martin (@Cricket_Ali) May 3, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



