AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీని రిటైర్మెంట్ చేయమని చెప్పిన అశ్విన్.. హాట్ టాపిక్‌గా మారిన ఫొటో..

Rohit Sharma - Virat Kohli: 36 ఏళ్ల విరాట్ కోహ్లీ, 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇద్దరూ 2027 ప్రపంచ కప్‌లో ఆడాలని కోరుకుంటున్నారు. అయితే, టెస్ట్‌లు, టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత, ఇద్దరూ తమ ఫామ్‌ను నిరూపించుకోవాలి. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ప్రపంచ కప్ లైనప్‌లో కొనసాగాలంటే రాబోయే రెండేళ్లలో వన్డేల్లో మరిన్ని పరుగులు సాధించాల్సి ఉంటుంది.

Virat Kohli: కోహ్లీని రిటైర్మెంట్ చేయమని చెప్పిన అశ్విన్.. హాట్ టాపిక్‌గా మారిన ఫొటో..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Oct 24, 2025 | 7:03 AM

Share

Rohit Sharma – Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు వన్డే పరాజయాలను చవిచూసింది. సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ విరాట్ కోహ్లీ ఖాతా తెరవలేకపోయాడు. మొదటి వన్డేలో ఎనిమిది పరుగులు చేసిన రోహిత్, రెండవ మ్యాచ్‌లో 73 పరుగులు చేయగలిగాడు. ఇంతలో, భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇద్దరు ఆటగాళ్లను విమర్శిస్తూ, “ఇక వదిలేయండి” అని రాసుకొచ్చాడు.

రోహిత్-విరాట్ గురించి అశ్విన్ ఏమన్నాడు?

బుధవారం (అక్టోబర్ 23, 2025), ఆస్ట్రేలియా చేతిలో భారత్ రెండో వన్డేలో ఓడిపోయిన తర్వాత అశ్విన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై “Just Leave It” (జస్ట్ లీవ్ ఇట్) అనే మూడు పదాలు ఉన్నాయి. ఆ పక్కనే ఒక ప్రసిద్ధ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌కు చెందిన ‘టిక్’ గుర్తును భారత త్రివర్ణ పతాకంలోని రంగుల్లో మార్చి చూపించారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌కు అశ్విన్ ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు. దీంతో ఇది ఎవరిని ఉద్దేశించిందో స్పష్టంగా తెలియకపోయినా, దాని అర్థం గురించి నెటిజన్లలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.

కోహ్లీ వైఫల్యం, రిటైర్మెంట్ ఊహాగానాలు..

ఆస్ట్రేలియా సిరీస్‌లో విరాట్ కోహ్లీకి ఇది చేదు అనుభవంగా మారింది. మొదటి వన్డేలో ఎనిమిది బంతులు ఆడి డక్ (0) అయిన కోహ్లీ, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో కేవలం నాలుగు బంతులు ఆడి లెగ్-బిఫోర్-వికెట్‌గా (LBW) వెనుదిరిగాడు. అతని వన్డే కెరీర్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో డక్ అవడం ఇదే తొలిసారి.

ఆ తర్వాత కోహ్లీ తన గ్లౌజులను పైకెత్తి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లడం, ఈ వేదికపై ఇది అతని ‘చివరి డాన్స్’ కావచ్చునని సోషల్ మీడియాలో చాలా మంది భావించడంతో, కోహ్లీ త్వరలో వన్డేల నుంచి రిటైర్ అవుతారేమో అనే ఊహాగానాలకు బలం చేకూరింది. సరిగ్గా ఇలాంటి సమయంలో అశ్విన్ “Just Leave It” అనే పోస్ట్ చేయడం ఈ చర్చను మరింత పెంచింది.

కొంతమంది అభిమానులు అశ్విన్ పోస్ట్‌ను కోహ్లీని ఉద్దేశించి ‘విమర్శలను వదిలేయమని’ చెప్పడానికి చేసిన సూచనగా భావించారు. మరికొందరు మాత్రం, కోహ్లీని ‘ఆట నుంచి తప్పుకోవాలని’ పరోక్షంగా సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రోహిత్ ఎన్ని పరుగులు చేశాడు?

భారత్ తరపున రెండు వన్డేల్లో రోహిత్ శర్మ 81 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో, అతను తన స్వభావాన్ని వదిలేసి 97 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్‌లలోనూ కోహ్లీ ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు, దీనితో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో భారతదేశం తొలి వన్డే సిరీస్ ఓటమి పాలైంది. 2027 ప్రపంచ కప్ నాటికి ఇద్దరు యువ ఆటగాళ్ళు వారి స్థానంలోకి వచ్చేలా ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను రిటైర్ చేయాలని అభిమానులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

విరాట్, రోహిత్ లక్ష్యం ఏమిటి?

36 ఏళ్ల విరాట్ కోహ్లీ, 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇద్దరూ 2027 ప్రపంచ కప్‌లో ఆడాలని కోరుకుంటున్నారు. అయితే, టెస్ట్‌లు, టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత, ఇద్దరూ తమ ఫామ్‌ను నిరూపించుకోవాలి. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ప్రపంచ కప్ లైనప్‌లో కొనసాగాలంటే రాబోయే రెండేళ్లలో వన్డేల్లో మరిన్ని పరుగులు సాధించాల్సి ఉంటుంది. లేదంటే సెలెక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..