8 బంతుల్లో 4 పరుగులు.. ఆ ట్రిక్ మిస్ అయిందిగా.. వైభవ్ కోసం అభిషేక్ ఇలా చేయాల్సిందే..!
Ashwin on Vaibhav: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొని 4 పరుగులకే వెనుదిరిగాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌ను వైఫల్యంగా చూడొద్దని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సూచించాడు. అదే సమయంలో వైభవ్‌ను ప్రశాంతంగా ఉంచేందుకు అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరింత చొరవ చూపాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Ashwin on Vaibhav: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ (India) ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. రెండో టీ20లో టీమిండియా విజయం సాధించినా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశం దక్కలేదు. కేవలం 8 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వైభవ్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. కొత్త పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడిలో కొంత ఆందోళన కనిపించిందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించాడు.
‘అభిషేక్ మరింత చొరవ చూపాల్సింది’
వైభవ్‌తో కలిసి మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడని గుర్తు చేసిన అశ్విన్.. సీనియర్ బ్యాటర్‌గా అతడు యువ ఆటగాడి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాల్సిందని చెప్పాడు.
వైభవ్ వరుసగా 8 బంతులు ఎదుర్కొన్నా షాట్లలో సరైన టైమింగ్ కనిపించలేదని అశ్విన్ పేర్కొన్నాడు. అలాంటి సమయంలో ప్రతి బంతినీ బౌండరీకి తరలించాలనే ఆలోచనకు బదులుగా స్ట్రైక్ రొటేట్ చేయాలని వైభవ్‌కు సూచించాల్సిందని తెలిపాడు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ: కివీస్‌తో వన్డే సిరీస్.. బుల్లెట్ షాట్లతో కోహ్లీ లోడింగ్.. రోకో జోడీ బయల్దేరేది ఎప్పుడంటే?
“వైభవ్ ప్రశాంతంగా కనిపించలేదు. అతడికి స్ట్రైక్ రొటేట్ చేయమని చెప్పాల్సింది. ఆ ట్రిక్ మిస్ అయింది” అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పాడు.
యువ ఆటగాడికి ఇదొక విలువైన పాఠం..
వైభవ్‌కు ఈ ఇన్నింగ్స్ ఒక మంచి పాఠంగా ఉపయోగపడుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. విదేశీ పర్యటనల్లో పరిస్థితులను అర్థం చేసుకోవడం యువ బ్యాటర్‌కు అంత సులభం కాదని చెప్పాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు జింబాబ్వే టూర్లో కూడా వైభవ్ సీనియర్ టీమిండియాతో అనుభవం సంపాదిస్తున్నాడని గుర్తు చేశాడు. ఇలాంటి ప్రతి మ్యాచ్ అతడి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.
వైభవ్‌పై తొందర అవసరం లేదు..
వైభవ్‌ను వెంటనే ప్రతీ మ్యాచ్‌లో ఆడించాలనే ఒత్తిడి టీమ్ మేనేజ్మెంట్పై ఉండకూడదని అశ్విన్ స్పష్టం చేశాడు. సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు జట్టుకు మంచి ఫలితాలు అందిస్తున్నప్పుడు వారి స్థానాలపై చర్చ అవసరం లేదని చెప్పాడు.
ఎక్కువమంది చదివినది: Tilak Varma: టీ20ల్లో కోహ్లీ వారసుడు ఇతనే.. ఛేజింగ్ అంటే చిర్రెత్తిపోతున్నాడుగా..!
సంజూ, అభిషేక్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక భాగస్వాములని అశ్విన్ గుర్తు చేశాడు. వైభవ్‌కు తన అవకాశాలు తప్పకుండా వస్తాయని.. అతడిపై భారీ అంచనాలు పెట్టి వెంటనే ఒత్తిడిలోకి నెట్టకూడదని సూచించాడు.
‘చిన్న పాఠాలు మిస్ కావొద్దు’..
వైభవ్‌ను భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా ఎదిగే ప్రతిభ ఉన్న క్రికెటర్‌గా అశ్విన్ అభివర్ణించాడు. అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇలాంటి చిన్న అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.
“అతడికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడే అతడిని ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టకూడదు. ఈ చిన్న పాఠాలను మిస్ చేయకపోవడం చాలా ముఖ్యం. అవే అతడిని మరింత పెద్ద ఆటగాడిగా తీర్చిదిద్దుతాయి” అని అశ్విన్ పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఎలాంటి సందేహం లేకపోయినా.. అతడికి సరైన సమయం, సరైన వాతావరణం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




