AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Test Batter : శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్‌లు ఎవరయ్యా.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్

Best Test Batter : శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌ లను పక్కన పెట్టి రిషబ్ పంత్‌ను ప్రస్తుత టీమిండియా బెస్ట్ టెస్ట్ బ్యాటర్‌గా రవి చంద్రన్ అశ్విన్ అభివర్ణించాడు. అఫ్గాన్ టెస్ట్ విజయం తర్వాత అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Best Test Batter : శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్‌లు ఎవరయ్యా.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
Best Test Batter
Rakesh
|

Updated on: Jun 09, 2026 | 5:02 PM

Share

Best Test Batter : ఐపీఎల్ 2026 హడావుడి ముగియడంతోనే భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల బిజీలోకి వచ్చేసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్ జట్టుతో ముల్లన్‌పూర్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌ ఫలితంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఊహించినట్లుగానే భారత జట్టు అఫ్గానిస్తాన్‌పై ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కనీసం కంప్లీట్ ఫైట్ కూడా ఇవ్వలేకపోయిన అఫ్గాన్ జట్టు.. కేవలం మూడు రోజుల్లోనే చేతులెత్తేసింది.

ఈ వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చలాయించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తమ అద్భుతమైన క్లాస్ షాట్లతో అఫ్గాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రతి ఒక్క ఆటగాడు బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు బోర్డును సిద్ధం చేయడంతో భారత బౌలర్లకు పని చాలా సులువైంది. అయితే టీమిండియా బ్యాటర్ల ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యేకంగా స్పందించాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో లక్నో సూపర్ జాయింట్స్ లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించడంతో రిషబ్ పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీపై కూడా నెగెటివ్ కామెంట్స్ రావడంతో అతను ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. కానీ టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే పంత్ మైండ్‌సెట్ వేరేలా ఉంటుందని అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న బ్యాటర్ల అందరిలోకి రిషబ్ పంతే బెస్ట్ టెస్ట్ బ్యాటర్ అని అశ్విన్ స్పష్టం చేశాడు. ఈ రేసులో ఉన్న శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లను కాదని పంత్‌కు అశ్విన్ అగ్రతాంబూలం ఇచ్చాడు.

రిషబ్ పంత్ బ్యాటింగ్ నైపుణ్యాలను అశ్విన్ ఆకాశానికెత్తాడు. “పంత్ క్రీజులో ఉండి డిఫెన్స్ ఆడుతుంటే లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ముగ్ధులవుతారు. అతను బంతిని డిఫెండ్ చేసినప్పుడు, ఆ బంతి కాస్త పక్కకు తప్పుకోనా అని వేడుకుంటున్నట్లు అనిపిస్తుంది. బౌలర్ ఎంత వేగంగా బంతి వేసినా సరే, దానిని ఎదుర్కోవడానికి పంత్ దగ్గర చాలా సమయం ఉంటుంది” అని అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఒకవైపు పంత్ ప్రతిభను కొనియాడుతూనే, మరోవైపు అతనికున్న ఒక చెడ్డ అలవాటును అశ్విన్ తీవ్రంగా విమర్శించాడు. పంత్ చాలాసార్లు కీలక సమయాల్లో బాధ్యతారహితమైన షాట్లు ఆడి అవుట్ అవుతుంటాడని మండిపడ్డాడు. “నువ్వు 80, 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు అలాంటి వింత షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడం నిజంగా విడ్డూరంగా ఉంటుంది. అంత దూరం వచ్చాక మరో 20 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేయలేవా? నీ నిర్లక్ష్యం వల్ల భారత్ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. పంత్ తన 80 రన్స్ స్కోర్లను వందలుగా మార్చుకుంటే అతని కెరీర్ రికార్డులు వేరే లెవెల్లో ఉంటాయి” అని హితవు పలికాడు.

కేవలం అశ్విన్ మాటల్లోనే కాదు.. రికార్డుల పరంగా చూసినా 2020 నుంచి భారత టెస్ట్ క్రికెట్‌లో పంతే అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 39 టెస్టుల్లో పంత్ 2,803 పరుగులు చేశాడు. పరుగులు పరంగా గిల్ అతనికంటే ముందున్నా.. పంత్ చేసిన పరుగులు అన్నీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా (SENA) లాంటి కఠినమైన విదేశీ పిచ్‌లపై వచ్చినవి కావడం విశేషం. మిగిలిన సీనియర్ బ్యాటర్లు విదేశాల్లో తడబడుతున్న వేళ పంత్ మాత్రం ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us