R Ashwin : ఆసియా కప్ అట్టర్ ప్లాప్.. ఇది టీ20 ప్రపంచకప్‌కు కర్టెన్ రైజర్ కూడా కాదు.. స్టార్ ప్లేయర్ సెన్సేషనల్ కామెంట్స్
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసియా కప్ 2025లో పోటీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందు, అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ టోర్నమెంట్ గురించి ఘాటుగా మాట్లాడారు. ఈ టోర్నమెంట్ వచ్చే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగపడదని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

R Ashwin : ఆసియా కప్ 2025లో పోటీతత్వం లోపించిందని భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. యూఏఈతో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌కి ముందు తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. ఈ టోర్నమెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు ఆసియా కప్ సరైన సన్నాహకం కాదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్ లెవల్ పెంచడానికి అశ్విన్ ఇచ్చిన సూచనలు, ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆసియా కప్ లెవల్ చాలా దిగజారిపోయిందని 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారతదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఇది సరైన సన్నాహకం కాదని అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్ క్వాలిటీని మెరుగుపరచడానికి ఇందులో భారత జూనియర్ జట్లను (ఇండియా ‘ఏ’) లేదా ఆఫ్రికా దేశాల జట్లను చేర్చాలని అశ్విన్ సూచించారు.
“టోర్నమెంట్‌ను మరింత పోటీతత్వంగా మార్చడానికి, సౌతాఫ్రికా వంటి దేశాన్ని చేర్చి దీన్ని ఆఫ్రో-ఆసియా కప్‌గా మార్చవచ్చు. లేకపోతే, కనీసం ఇండియా ‘ఏ’ జట్టునైనా చేర్చాలి, అప్పుడే కాస్త పోటీ ఉంటుంది. బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడనేలేదు. ఎందుకంటే వారితో మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ జట్లు అసలు భారత్‌తో ఎలా పోటీ పడతాయి?” అని ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రశ్నించారు.
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ప్రారంభమైంది. అయితే, హాంకాంగ్ జట్టు అఫ్ఘానిస్తాన్ జట్టుకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వారు 100 పరుగులు కూడా చేయలేకపోయారు. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 94 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి సరిగ్గా అదే మార్జిన్‌తో మ్యాచ్‌ను ఓడిపోయింది. అఫ్ఘానిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో పాటు బంతితో 1/4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
అఫ్ఘానిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, రషీద్ ఖాన్ నేతృత్వంలోని జట్టు కూడా భారత్‌కు ఏమాత్రం సరిపోదని అశ్విన్ అభిప్రాయపడ్డారు. “ఇది 2026 టీ20 ప్రపంచకప్‌కు ఒక కర్టెన్ రైజర్ కూడా కాదు, కేవలం కర్టెన్ మాత్రమే. ఈ టోర్నమెంట్ పెద్దగా కొలమానం కాదు. అఫ్ఘానిస్తాన్ బౌలర్ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ, భారత్ బాగా బ్యాటింగ్ చేసి 170+ పరుగులు చేస్తే, అఫ్ఘానిస్తాన్ దానిని ఎలా ఛేదించలేదు” అని అశ్విన్ అన్నారు.
“భారత్‌ను ఓడించాలంటే వారిని ఎలాగైనా 155 పరుగులకు కట్టడి చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలి. సాధారణంగా టీ20 మ్యాచ్‌లు ఉత్కంఠగా ఉంటాయి, కానీ ఈ ఆసియా కప్‌లో భారత్ వాటిని కూడా వన్ సైడ్ మార్చే అవకాశం ఉంది” అని భారత మాజీ స్పిన్నర్ అన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




