AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs DC, IPL 2024: రీఎంట్రీ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు నిరాశ.. పంజాబ్ చేతిలో ఢిల్లీ పరాజయం

దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన స్టార్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ కు ఓటమి పలకరించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రెండో మ్యాచ్‌లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది

PBKS vs DC, IPL 2024: రీఎంట్రీ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు నిరాశ.. పంజాబ్ చేతిలో ఢిల్లీ పరాజయం
Punjab Kings vs Delhi Capitals
Basha Shek
|

Updated on: Mar 23, 2024 | 8:08 PM

Share

దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన స్టార్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ కు ఓటమి పలకరించింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రెండో మ్యాచ్‌లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్‌కు సొంతగడ్డ అయిన మల్లన్‌పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు పంజాబ్‌పై భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. మొత్తం 20 ఓవర్లలో, జట్టు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్‌ కుర్రాన్ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టే ఢిల్లీ ఓపెనర్లు ధాటింగ్ బ్యాటింగ్ ప్రారంభించారు. ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో పృథ్వీ షాను ఎంపిక చేయకపోవడం ద్వారా ఢిల్లీ కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ మిచెల్ మార్ష్ డేవిడ్ వార్నర్ వారికి వేగవంతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 20 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్ష్ అవుటైనా వార్నర్ షే హోప్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వార్నర్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. 454 రోజుల తర్వాత మ్యాచ్ కోసం మైదానంలోకి దిగిన రిషబ్ పంత్ కొన్ని మంచి షాట్లు ఆడినా ఎక్కువసేపు నిలవలేక హర్షల్ పటేల్ బంతికి ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడి నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడడంతో మిడిలార్డర్ మొత్తం ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. పరుగుల వేగం కూడా తగ్గి 17 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సమయంలో 7 వికెట్లు పడిపోయాయి. ఇక్కడే తన మెరుపు బ్యాటింగ్‌తో ఢిల్లీని బలమైన స్కోరుకు తీసుకెళ్లాడు ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్. ఈ 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ చివరి ఓవర్‌లో హర్షల్ పటేల్‌పై వరుసగా 5 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టి జట్టుస్కోరును 174 పరుగులకు తీసుకెళ్లాడు. 25 పరుగులు చేశాడు. పోరెల్ కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఓపెనర్ల శుభారంభం..

ఢిల్లీలాగే పంజాబ్ ఓపెనర్లు కూడా వేగంగానే ఆరంభించారు. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో 3 ఓవర్లలో 34 పరుగులు చేశారు. కానీ పంజాబ్ నాలుగో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ధావన్‌ను అవుట్ కాగా, బెయిర్‌స్టో రనౌట్ అయ్యాడు. ఇక్కడి నుంచి ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, సామ్‌ కుర్రాన్‌లు ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్టం చేసినా.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్.. ప్రభాసిమ్రన్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. కొద్దిసేపటికే కుల్దీప్ జితేష్ శర్మను కూడా స్టంపౌట్ చేశాడు. దీంతో బాధ్యతంతా పంజాబ్ అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కర్రన్ పై పడింది. ఇంగ్లండ్‌కు చెందిన అతను తన తోటి ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టన్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. కరణ్ కేవలం 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి విజయానికి చేరువగా వచ్చి 19వ ఓవర్లో ఔటయ్యాడు. 20వ ఓవర్‌లో లివింగ్‌స్టన్ అద్భుత సిక్సర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.