AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఆ స్టార్ బౌలర్‌పైనే కన్ను.. టీ20 స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన పంజాబ్.. వదులుకున్న ప్లేయర్స్ వీరే..

వచ్చే సీజన్‌కు జట్టులో పలు మార్పులు చేసి బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. మినీ వేలానికి ముందు కెప్టెన్‌ను మార్చడమే కాదు..

IPL 2023: ఆ స్టార్ బౌలర్‌పైనే కన్ను.. టీ20 స్పెషలిస్ట్‌కు షాకిచ్చిన పంజాబ్.. వదులుకున్న ప్లేయర్స్ వీరే..
Punjab Kings
Ravi Kiran
|

Updated on: Nov 16, 2022 | 8:07 AM

Share

ఐపీఎల్ 2022లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచని పంజాబ్ కింగ్స్.. వచ్చే సీజన్‌కు జట్టులో పలు మార్పులు చేసి బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. మినీ వేలానికి ముందు కెప్టెన్‌ను మార్చడమే కాదు.. జట్టులోని ఏకైక టీ20 స్పెషలిస్ట్‌కు కూడా షాకిచ్చింది. మంగళవారం తమతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, విడిచిపెట్టిన ప్లేయర్స్ జాబితాను విడుదల చేసింది పంజాబ్ కింగ్స్. మినీ వేలానికి ముందుగా 9 మంది ఆటగాళ్ళను పంజాబ్ విడిచిపెట్టింది. అందులో టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ఉండటం గమనార్హం. ప్రతీ సీజన్‌లోనూ హయ్యస్ట్ రన్ గెట్టర్‌గా నిలిచిన మయాంక్‌ను పంజాబ్ వదులుకోవడమే కాదు.. అతడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించి.. శిఖర్ ధావన్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.

మరోవైపు, టీ20 వరల్డ్‌కప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన సామ్ కర్రన్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు పంజాబ్ ఆసక్తిని చూపిస్తున్నట్లు సమాచారం. 2019లో పంజాబ్ తరపున ఆడిన కర్రన్.. ఆ సీజన్‌లో అటు బ్యాట్.. ఇటు బంతితో ఫర్వాలేదనిపించాడు. అయితే పంజాబ్ మాత్రం అనూహ్యంగా 2020 వేలంలో కర్రన్‌ను వదులుకుంది. దీంతో ఆ సీజన్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడ్ని 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. సీఎస్‌కే తరఫున 2020, 2021 సీజన్‌లు ఆడిన కర్రన్.. 2022 మెగా వేలానికి ముందు గాయం బారిన పడి, ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

రిలీజ్ ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్ని హొవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, చట్టర్జీ

రిటైన్ ప్లేయర్స్: ధావన్, షారూఖ్ ఖాన్, బెయిర్‌స్టో, ప్రభసిమ్రాన్ సింగ్, రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బవా, రిషి ధావన్, లివింగ్‌స్టన్, అతర్వ టైడ్, అర్షదీప్ సింగ్, బల్తెజ్ సింగ్, ఎల్లిస్, రబడా, రాహుల్ చాహార్, హర్ప్రీట్ బ్రర్

మిగిలిన మొత్తం: రూ 32.2 కోట్లు, ఓవర్సీస్ స్లాట్స్ – 3