పరీక్ష రాస్తూనే ఐపీఎల్ ఆడుతున్న ప్రయాస్..!

16 ఏళ్లకే ఐపీఎల్ లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఆర్సీబీ ఆటగాడు ప్రయాస్ బర్మన్.. మరోవైపు 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కోల్‌కత్తాలోని కళ్యాణి పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న అతడు ఇటీవల అర్ధశాస్త్రం పరీక్ష రాశాడు. ఇక SRH తో ఆదివారం జరిగిన మ్యాచ్ ద్వారా తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన బర్మన్.. ఆ మ్యాచ్ లో వికెట్లేమీ తీయకుండా 56 పరుగులిచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రయాస్‌కు బెంగుళూరు […]

  • Ravi Kiran
  • Publish Date - 8:52 pm, Mon, 1 April 19
పరీక్ష రాస్తూనే ఐపీఎల్ ఆడుతున్న ప్రయాస్..!

16 ఏళ్లకే ఐపీఎల్ లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఆర్సీబీ ఆటగాడు ప్రయాస్ బర్మన్.. మరోవైపు 12వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కోల్‌కత్తాలోని కళ్యాణి పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న అతడు ఇటీవల అర్ధశాస్త్రం పరీక్ష రాశాడు. ఇక SRH తో ఆదివారం జరిగిన మ్యాచ్ ద్వారా తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన బర్మన్.. ఆ మ్యాచ్ లో వికెట్లేమీ తీయకుండా 56 పరుగులిచ్చాడు.

ఇది ఇలా ఉంటే ప్రయాస్‌కు బెంగుళూరు జట్టు నుంచి సహకారం ఉందని తన తండ్రి కౌశిక్ బర్మన్ తెలిపారు. కోచ్‌ గ్యారీ క్రిస్టన్, కెప్టెన్‌ కోహ్లీ, ఏబి డివిలియర్స్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రయాస్‌ను నెట్స్‌లో ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పారు.