IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. గెలిచేది ఎవరో చెప్పేసిన ప్రముఖ జ్యోతిష్యులు
సుమారు 12 ఏళ్ల కిందట 2011లో వరల్డ్ కప్ ఫైనల్ కు ఆతిథ్యమిచ్చిన ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే ఇప్పుడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ స్పందించారు. ఈ మ్యాచ్ విజేతతోపాటు ఇందులో ఏయే ఆటగాళ్లు కీలకపాత్ర పోషించబోతున్నారో కూడా అంచనా వేశారు.

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. కీలకమైన సెమీ-ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే తొలి నాకౌట్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమని టీమిండియా ధీమాగా ఉంది. అయితే అది అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో టీమిండియా కివీస్ చేతిలో ఓడిపోతూనే ఉంది. 2003 తర్వాత, న్యూజిలాండ్ ODI ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్‌లో భారత్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 12 ఏళ్ల కిందట 2011లో వరల్డ్ కప్ ఫైనల్ కు ఆతిథ్యమిచ్చిన ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే ఇప్పుడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ స్పందించారు. ఈ మ్యాచ్ విజేతతోపాటు ఇందులో ఏయే ఆటగాళ్లు కీలకపాత్ర పోషించబోతున్నారో కూడా అంచనా వేశారు.
సుమిత్ బజాజ్ అంచనాల ప్రకారం సెమీస్ మ్యాచ్ లో గెలిచేది టీమిండియానే. నాకౌట్‌లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి అహ్మదాబాద్ లో జరగబోయే ఫైనల్ కు రోహిత్ సేన చేరుకుంటుందంటున్నారు. గతంలో టీమిండియా సెమీస్ చేరుతుందని జోస్యం చెప్పిన సుమిత్ ఇప్పుడు భారత్ జట్టుకు అన్నీ అనుకూలంగా ఉండడంతో కచ్చితంగా తుది సమరానికి అర్హత సాధిస్తుందంటున్నాడు. ‘ఈ మ్యాచ్ లో భారత జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 250 నుంచి 270 రన్స్ చేయొచ్చు. ఆ తర్వాత 47 లేదా 48వ ఓవర్ కల్లా విధించిన భారత్ టార్గెట్ ను ఛేదిస్తుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి, గిల్, కెప్టెన్ రోహిత్ కీలక పాత్రలు పోషిస్తారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ జాతకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం రోహిత్ వయసు 36.5 ఏళ్లు. జాతక రీత్యా హిట్ మ్యాను మ్యాచ్‌ను గెలిపిస్తాడు. విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక నాకౌట్ మ్యాచ్ లలో సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన కూడా బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్, బుమ్రా, జడేజాలు కూడా రాణిస్తారు. అదే సమయంలో ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్ యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర సెమీఫైనల్లో త్వరగా ఔటయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని సుమిత్ తెలిపారు.
టీమిండియానే ఫేవరెట్
View this post on Instagram
కాగా 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందని జోస్యం చెప్పిన అనిరుధ్ కుమార్ మిశ్రా కూడా ఈ 2023 వరల్డ్ కప్ పై స్పందించాడు. రోహిత్ సేన కచ్చితంగా విశ్వ విజేతగా నిలుస్తుందని ఆయన టోర్నమెంట్ ప్రారంభానికి ముందే అంచానా వేశాడు. ప్రస్తుతం జ్యోతిష్యుల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి అంచనాలు నిజం కావాలంటూ టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అంచనాలు నిజం కావాలి..
Much before coming to Twitter, I predicted in 2011, about 1.5 months before the final of the Cricket World Cup that India would win the World Cup.
Now again, I am being flooded with requests of predicting the winner of the upcoming world cup. Although I have made it clear that I… pic.twitter.com/cID9paRHjg
— Anirudh Kumar Mishra (Astrologer) (@Anirudh_Astro) October 4, 2023




