AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 Rankings: ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోలే.. కట్ చేస్తే.. వరుసగా సెంచరీలు.. ఐసీసీ రెండో ర్యాంక్‌

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 2 భారీ సెంచరీలతో మొత్తం 331 పరుగులు చేసిన సాల్ట్.. ఇప్పుడు టీ20 బ్యాటర్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ ఐపీఎల్ వేలంలో అసలు అమ్ముడుపోలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడిన సాల్ట్‌

ICC T20 Rankings: ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోలే.. కట్ చేస్తే.. వరుసగా సెంచరీలు.. ఐసీసీ రెండో ర్యాంక్‌
Phil Salt
Basha Shek
|

Updated on: Dec 28, 2023 | 4:55 PM

Share

ఐసీసీ కొత్త టీ20 ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. బ్యాటర్ల జాబితాలో ఈసారి కూడా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఇంగ్లండ్ స్టార్‌ ఫిల్ సాల్ట్ ఏకంగా 88 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు ఫిల్ సాల్ట్ 90వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 2 భారీ సెంచరీలతో మొత్తం 331 పరుగులు చేసిన సాల్ట్.. ఇప్పుడు టీ20 బ్యాటర్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ ఐపీఎల్ వేలంలో అసలు అమ్ముడుపోలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడిన సాల్ట్‌ ఈసారి 1.5 కోట్ల తో ఐపీఎల్‌ పేరు నమోదు చేసుకున్నాడు. అయితే ఈ బేస్ ధరతో సాల్ట్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడైనా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఈ ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌పై ఆసక్తి చూపిస్తాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

కాగా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే రషీద్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం మొదటి స్థానంలోకొనసాగుతున్నాడు. టీమిండియా ప్రిన్స్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లీ (3), రోహిత్‌ శర్మ (4), డేవిడ్‌ వార్నర్‌ (5) ఉన్నారు. టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా, ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఏకంగా 88 స్థానాలు జంప్..

బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే