Video: ఢిల్లీకి చేరిన పెద్ది ఎఫెక్ట్! ఫేమస్ షాట్ తో మెంటలెక్కిస్తున్న యంగ్ ప్లేయర్.. సోషల్ మీడియాను షాక్ చేస్తున్న వీడియో!
SRH vs DC మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన "పెద్ది" మూవీ స్టైల్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సమీర్ రిజ్వీ చేసిన ఫేమస్ షాట్ రామ్ చరణ్ గ్లింప్స్‌ను పోలి ఉండటంతో మెగా అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ SRHకి తప్పనిసరి విజయ పోరాటంగా మారింది. DC టాప్-4లోకి వెళ్లాలన్న ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

ఈరోజు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విడుదల చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న “పెద్ది” సినిమా గ్లింప్స్‌కి సంబంధించిన ఆడియోను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించి, వీడియోను ప్రత్యేకంగా ఎడిట్ చేశారు. ఇందులో రామ్‌చరణ్ కొట్టిన శాట్‌ను ఢిల్లీ యువ ఆటగాడు సమీర్ రిజ్వీ అనుకరించడం విశేషం. రాంచరణ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయ్యింది. దీంతో ఈ వీడియోను మెగా అభిమానులు, క్రికెట్ ప్రేమికులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ, పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ రోజు జరిగే మ్యాచ్ SRH జట్టుకు ఎంతో కీలకమైనదిగా మారింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసిన SRH, ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు, ఓటమి వాటిల్లితే ప్లేఆఫ్స్ రేసులోంచి పూర్తిగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ మార్జిన్లతో విజయం సాధించినా గానీ, ప్లేఆఫ్స్ ఆశలు నిలబడతాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో SRH తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇంకోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం మంచి ఊపులో ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి ఆరింట్లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ రోజు SRHపై గెలిచి టాప్ 4లోకి ప్రవేశించాలని DC ఆశిస్తోంది. ఓవైపు రామ్‌చరణ్ – సమీర్ రిజ్వీ వీడియో హంగామా, మరోవైపు ప్లేఆఫ్స్ ఆశల ముద్దుబోతు మ్యాచ్ నేపథ్యంలో ఈ పోరును అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
SRH vs DC ప్రాబబుల్ ప్లేయింగ్ XIలు
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ
ఇంపాక్ట్ ప్లేయర్: మహ్మద్ షమీ
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్ (WK), ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, KL రాహుల్, అక్షర్ పటేల్ (c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్: ముఖేష్ కుమార్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



