PAK Vs SL: 2 మ్యాచ్‌ల్లో 199 పరుగులు.. సూపర్ సెంచరీతో బౌలర్లను ఉతికారేసిన పాక్ బ్యాటర్.!

పాకిస్తాన్, శ్రీలంక ఉమెన్స్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన పాక్ ఉమెన్స్ టీం.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల కరాచీ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక ఉమెన్స్ టీంల మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ టీం 73 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అమీన్(123) అద్భుత […]

PAK Vs SL: 2 మ్యాచ్‌ల్లో 199 పరుగులు.. సూపర్ సెంచరీతో బౌలర్లను ఉతికారేసిన పాక్ బ్యాటర్.!
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 03, 2022 | 9:33 PM

పాకిస్తాన్, శ్రీలంక ఉమెన్స్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన పాక్ ఉమెన్స్ టీం.. వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల కరాచీ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక ఉమెన్స్ టీంల మధ్య జరిగిన రెండో వన్డేలో పాక్ టీం 73 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అమీన్(123) అద్భుత సెంచరీతో అదరగొట్టింది.

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇందులో సిద్రా అమీన్ బ్యాట్ నుంచి సగం పరుగులు రావడం విశేషం. ఆమీన్ తొలి వికెట్‌కు మునిబ్ అలీతో కలిసి 158 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అమీన్ 150 బంతుల్లో 123 పరుగులు చేయగా.. ఆమె ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ లేకపోవడం గమనార్హం. 82 స్ట్రైక్ రేట్‌తో 11 ఫోర్లు కొట్టింది.

ఇక 254 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన శ్రీలంక ఉమెన్స్ టీం.. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా 4 వికెట్లు పడగొట్టగా.. సోహైల్ 2 వికెట్లు, నిదా దార్ 1 వికెట్ తీశారు. కాగా, గత మ్యాచ్‌లోనూ అమీన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మొదటి వన్డేలో 119 బంతులు ఎదుర్కుని 76 పరుగులు చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.