Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్‌ లేకుండానే వరల్డ్‌కప్ వార్మప్‌ మ్యాచ్‌!

Pakistan vs New Zealand: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్ మ్యాచ్‌లు లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న నగరవాసులకు మరో షాకింగ్ న్యూస్. హైదరాబాద్‌లో జరగనున్న తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదని రాచకొండ పోలీసులు స్పష్టంచేశారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ లో నిరుత్సాహం నెలకొంది. వివరాల్లోకెళితే..

Hyderabad: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్‌ లేకుండానే వరల్డ్‌కప్ వార్మప్‌ మ్యాచ్‌!
Uppal Stadium
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 24, 2023 | 12:40 PM

Pakistan vs New Zealand: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్ మ్యాచ్‌లు లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న నగరవాసులకు మరో షాకింగ్ న్యూస్. హైదరాబాద్‌లో జరగనున్న తొలి వామప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడం లేదని రాచకొండ పోలీసులు స్పష్టంచేశారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ లో నిరుత్సాహం నెలకొంది. వివరాల్లోకెళితే.. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29, అక్టోబర్ 3న రెండు వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. వినాయక చవితి నిమజ్జనం తర్వాతి రోజు వార్మప్ మ్యాచ్ ఉండటంతో స్టేడియం వద్ద భద్రత ఏర్పాటు చేయలేమని రాచకొండ పోలీసులు ఇప్పటికే హెచ్‌సీఏకే తెలిపారు. 29న కూడా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉంటాయని.. దీంతో ఆ రోజు జరిగే మ్యాచ్‌కు భద్రత ఇవ్వడం కష్టమవుతుందని వెల్లడించారు. ఇదే విషయంపై బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాసింది.

దీంతో ఈ నెల 29న జరిగేది కేవలం వార్మప్ మ్యాచ్ కావడంతో ప్రేక్షకులను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు వేదిక మార్చడం కష్టంతో కూడుకున్నది కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు రిఫండ్ చేయనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ తర్వాత జరిగే వార్మప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించనున్నారు. హైదరాబాద్‌లో 29న పాకిస్తాన్-న్యూజీలాండ్, అక్టోబర్ 3న పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఇక వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లు మూడింటిని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 6న పాకిస్తాన్-నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజీలాండ్-నెదర్లాండ్స్, అక్టోబర్ 12న పాకిస్తాన్-శ్రీలంక మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ స్టేడియంలో వార్మప్‌తో కలిపి నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజీలాండ్, నెదర్లాండ్స్ చెరి రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

మరోవైపు పాకిస్తాన్ జట్టు మరో 5 రోజుల్లో హైదరాబాద్‌లో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఇంకా వీసా క్లియర్ కాకపోవడంతో ఇండియాకు బయలుదేరలేదు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది వీసాల కోసం వెరిఫికేషన్ జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే దుబాయ్ మీదుగా ఈ నెల 27న హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..