Cricket: చివరి బాల్ వరకు ఉత్కంఠే.. అయినా ఖాళీగానే స్టేడియం.. ఫ్రీగా టికెట్లు ఇచ్చినా.. వద్దు బాబోయ్ అన్న ప్రేక్షకులు.. ఎక్కడంటే?
Pakistan vs New Zealand Karachi Test: కరాచీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుపై ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఐదవ రోజు ఉత్కంఠ తారాస్థాయికి చేరినా.. స్టేడియంలోని స్టాండ్‌లు ఖాళీగా కనిపించాయి.
Pakistan vs New Zealand: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జనవరి 2 నుంచి జనవరి 6 మధ్య కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి, పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 304 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవడానికి ఆతిథ్య జట్టు 15 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో, అంపైర్ అలీమ్ దార్ తగినంత వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ని కొనసాగించడం కుదరదంటూ ప్రకటించాడు. లైట్ మీటర్‌తో లైట్‌ని తనిఖీ చేశాడు. ఆ తర్వాత, సెకండ్ ఫీల్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్‌తో సంప్రదించి, ఐదో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లో ఫలితం కోసం ఇరుజట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. కానీ, అంపైర్ అలీమ్ దార్ ఇచ్చిన సిగ్నల్‌తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డాడు. అయితే, ఇంతటి ఉత్కంఠను చూసేందుకు ప్రేక్షకులు లేకపోవడంతో గమనార్హం.
ఉచిత ప్రవేశం ఉన్నప్పటికీ.. ఆసక్తి చూపని ప్రేక్షకులు..
కరాచీలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులూ ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. పాక్ గడ్డపై ఈ ఏడాది ఆఖరి టెస్టు ఇదే కావడం గమనార్హం. ఇంత జరిగినా ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపలేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో కొద్ది మంది ప్రేక్షకులు మాత్రమే కనిపించారు. మ్యాచ్ ఫలితం బంతి బంతికి మారుతున్న సమయంలోనూ.. కరాచీ నేషనల్ స్టేడియం స్టాండ్‌లు ప్రేక్షకులు లేకుండా ఖాళీగా ఉన్నాయి.
సిరీస్ డ్రా..
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ డ్రాగా ముగిసింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు కరాచీలో జరిగింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 311 పరుగులకు డిక్లేర్ చేసింది. కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 612 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌కు 61 పరుగులు వచ్చాయి. ఈ విధంగా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మరోవైపు రెండో టెస్టు గురించి మాట్లాడుకుంటే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 277 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కాగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 304 పరుగులు చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..