Asia Cup 2025: మళ్లీ సున్నా..! వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పాక్ ఓపెనర్ డకౌట్
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ యూఏఈతో జరిగే మ్యాచ్ చాలా కీలకం. టీమిండియాతో ఓడిన తర్వాత, సూపర్ ఫోర్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. షైమ్ అయ్యూబ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. పాకిస్థాన్ విజయం సాధించితేనే సూపర్ ఫోర్స్ దశకు అర్హత సాధించే అవకాశం ఉంది.

ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన పాక్.. లీగ్ దశ దాటి సూపర్ ఫోర్‌కు క్వాలిఫై అవ్వాలంటే యూఏఈపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్ ఫోర్‌కు క్వాలిఫై అయిపోయింది. యూఏఈ, పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఒమన్‌తో నామమాత్రపు మ్యాచ్ మిగిలి ఉంది.
అయితే ప్రస్తుతం యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోతే.. లీగ్ దశలోనే ఇంటి బాటపడుతుంది. గ్రూప్ ఏ నుంచి ఇండియాతో పాటు యూఏఈ సూపర్ ఫోర్‌కు క్వాలిఫై అవుతుంది. ఇంతటి కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఓపెనర్ షైమ్ అయ్యూబ్ డకౌట్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయిన అయ్యూబ్ ఇప్పుడు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్ డకౌట్ అయ్యాడు.
ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో, అలాగే టీమిండియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఇప్పుడు కూడా సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ఓ పాకిస్థాన్ ఆటగాడు.. షైమ్ అయ్యూబ్ గురించి మాట్లాడుతూ.. షైమ్ అయ్యూబ్ ఇంకా తన 80 శాతం ఆటను ఈ ప్రపంచానికి చూపించలేదని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ తీరా గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత షైమ్ అయ్యూబ్ వరుస డకౌట్లతో నవ్వుల పాలవుతున్నాడు.
Saim Ayub bags his third consecutive duck in the Asia Cup 2025🤯
📸: Sony LIV#PAKvsUAE pic.twitter.com/L5LfzLTaLG
— CricTracker (@Cricketracker) September 17, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




