Watch Video: ఇదేందయ్యా ఆజామూ.. సన్‌రైజర్స్ బౌలర్ దెబ్బకు.. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చావ్..
Babar Azam: పెర్త్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో కూడా బాబర్ అజామ్ బ్యాట్ పనిచేయలేదు. పాకిస్తాన్ 360 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, మెల్‌బోర్న్‌లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. బాబర్ అజామ్ ఈ వికెట్ తరువాత, చాలా మంది ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు పాక్ మాజీ సారథిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Australia vs Pakistan: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఫ్లాప్ షో మరోసారి కనిపించింది. పాకిస్థాన్ క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన బాబర్ ఆజం గత కొన్ని నెలలుగా పేలవ ఫాంతో సతమతమవుతున్నాడు.
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్టులోనూ అదే జరిగింది. కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టును క్రీజులో నిలబెట్టేందుకు బరిలోకి వచ్చిన బాబర్ ఆజం.. కేవలం ఒక పరుగుకే పెవిలియన్ చేరి ఫ్యాన్స్‌ను మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు తిరిగి వచ్చి, అతని జట్టు పాకిస్థాన్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బాబర్ ఆజం పెవిలియన్ చేరిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
బాబర్ ఆజాం వైరల్ వీడియో..
UNBELIEVABLE!
Pat Cummins gets rid of Babar Azam again – with another BEAUTY! #OhWhatAFeeling @Toyota_Aus #AUSvPAK pic.twitter.com/iXQ6M7E10l
— cricket.com.au (@cricketcomau) December 27, 2023
పెర్త్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో కూడా బాబర్ అజామ్ బ్యాట్ పనిచేయలేదు. పాకిస్తాన్ 360 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, మెల్‌బోర్న్‌లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. బాబర్ అజామ్ ఈ వికెట్ తరువాత, చాలా మంది ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు పాక్ మాజీ సారథిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాబర్ ఆజాం కష్టమైన లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడల్లా విఫలమవుతాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడని, ఆస్ట్రేలియా జట్టు 318 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తరపున మార్నస్ లాబుస్‌చాగ్నే అత్యధికంగా 63 పరుగులు చేశాడు. అతను తప్ప ఆస్ట్రేలియా ఆటగాడు ఎవరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. అదే సమయంలో రెండో రోజు ఆటముగిసే సరికి పాకిస్తాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(29)తో పాటు అమీర్ జమాల్ (2) క్రీజులో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..