AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: అసలే ఘోర పరాజయం.. ఆపై పాక్ జట్టుకు మరో బిగ్ షాకిచ్చిన ఐసీసీ..

Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ టీం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఓటమి నుంచి కోలుకునేలోపే ఐసీసీ మరో బిగ్ షాకిచ్చింది. దీంతో భారత్‌తో మ్యాచ్‌కు ముందే డీలా పడిపోయింది.

IND vs PAK: అసలే ఘోర పరాజయం.. ఆపై పాక్ జట్టుకు మరో బిగ్ షాకిచ్చిన ఐసీసీ..
Pakistan Vs New Zealand, 1st Match, Group A
Venkata Chari
|

Updated on: Feb 20, 2025 | 8:24 PM

Share

IND vs PAK: కరాచీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో డీలా పడిన పాక్ జట్టుకు, ఐసీసీ మరో బిగ్ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్‌‌తో ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. దీంతో మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది.

బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యానికి ఒక ఓవర్ తక్కువగా బౌల్ చేసిన పాక్ జట్టుపై స్లో ఓవర్ రేట్ జరిమానాను ఐసీసీ విధించబడింది.

ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షార్ఫుడ్డౌలా, థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఫిర్యాదు చేయగా.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ శిక్షను విధించారు. దీంతో పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం తగ్గించారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన నేరాన్ని అంగీకరించడంలో అధికారిక విచారణ అవసరం లేదని మ్యాచ్ రిఫరీ తెలిపాడు.

స్లో ఓవర్-రేట్ నేరాలకు సంబంధించిన ఐసీసీ ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయ సిబ్బంది ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, సంబంధిత జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే, ఆటగాళ్లకు ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.

1996 తర్వాత తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్, గ్రూప్ A ప్రారంభ మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్‌లో జరిగే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రిజ్వాన్, అతని బృందం భారత్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు