T20 Cricket: 10 రోజుల్లో 9 వికెట్లు.. కట్‌చేస్తే.. టోర్నీ మధ్యలో మంత్రిగా ప్రమోషన్ కొట్టేసిన ఫాస్ట్ బౌలర్.. ఎవరంటే?
Pakistan Fast Bowler: వహాబ్ రియాజ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ కారణంగా అతను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాడు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బంతితో విధ్వంసం సృష్టిస్తున్న పాకిస్థాన్ స్టార్ బౌలర్ వహాబ్ రియాజ్ టోర్నీ మధ్యలో గుడ్‌న్యూస్ అందుకున్నాడు. అతను పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక ప్రభుత్వం తరపున క్రీడా మంత్రిగా మారాడు. అయితే, అతను ప్రస్తుతం బంగ్లాదేశ్ లీగ్‌లో బిజీగా ఉన్నందున, అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటాడు. ఎడమచేతి వాటం బౌలర్ పాకిస్తాన్ తరపున 3 ఫార్మాట్లలో మొత్తం 156 మ్యాచ్‌లలో 237 వికెట్లు తీశాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
అయితే 2019లో రియాజ్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు. విరామం తీసుకున్న అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే గత 2 సంవత్సరాలుగా, అతను పాకిస్తాన్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడలేకపోయాడు.
టీ20 క్రికెట్‌లో సందడి..
వాహబ్ రియాజ్ 2020 నుంచి పాకిస్తాన్ తరపున ఆడే అవకాశాన్ని పొందలేకపోయాడు. కానీ, అతను బంగ్లాదేశ్ లీగ్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. గత 10 రోజుల్లో బంగ్లాదేశ్ లీగ్‌లో 9 వికెట్లు తీశాడు. గతంలో టీ20లో 400 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. పాకిస్థాన్ నుంచి ఈ మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇది మాత్రమే కాదు, డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్ తర్వాత ప్రపంచంలో ఆరో బౌలర్ అయ్యాడు.




వాహబ్ 2019లో టెస్టు క్రికెట్‌కు రిటైరయ్యాడు. అదే సమయంలో, 2020 నుండి, అతనికి వన్డే, టీ20 ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కూడా రాలేదు. వాహబ్ పాకిస్థాన్ తరపున 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. ఈ సమయంలో అతను టెస్టుల్లో 83 వికెట్లు, వన్డేల్లో 120, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 34 వికెట్లు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..