Dhoni Entertainment: సౌత్ సినిమాతో మొదలైన ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్’.. హీరో, హీరోయిన్లుగా ఎవరంటే?
Lets Get Married: ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి నిర్మాణ చిత్రం మోషన్ పోస్టర్ విడుదలైంది. ధోనీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఇవానా కథానాయికగా నటించనుంది.

భారత మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2023కు సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇదే అతడి చివరి ఐపీఎల్ కావచ్చని కూడా అంతా భావిస్తున్నారు. అతని ఐపీఎల్ కెరీర్‌లో చివరి దశ కూడా. ఐపీఎల్‌కి వీడ్కోలు చెప్పకముందే ధోనీ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తొలి నిర్మాణ చిత్రం మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది.
ఎల్‌జీఎం(మనం పెళ్లి చేసుకుందాం) అనే తమిళ సినిమాతో ధోని ఎంటర్‌టేన్‌మెంట్స్ మొదలుకానుంది. ధోనీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఇవానా కథానాయికగా నటించనుంది. అదే సమయంలో హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకుడు.
కాన్సెప్ట్ రాసిన సాక్షి ధోని..
We’re super excited to share, Dhoni Entertainment’s first production titled #LGM – #LetsGetMarried!
Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023
ధోని భార్య సాక్షి ధోని ఈ సినిమా కాన్సెప్ట్‌ను రచించారని తమిళమణి తెలిపారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ జనవరి 2019లో ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పటివరకు 3 షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించింది. మోషన్ పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ డ్రామా సినిమా రోడ్ ట్రిప్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. తమిళమణి ప్రకారం, సాక్షి కాన్సెప్ట్ చదివిన తర్వాత, దాని ప్రత్యేకత నాకు తెలిసింది. ఇది పూర్తిగా తాజాది. కుటుంబ వినోదానికి అనుకూలంగా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించి సాక్షి ప్రస్తుతం చెన్నైలోనే ఉంటుందంట.
ధోనీ ప్రాక్టీస్ షురూ..
సాక్షి సినిమాతో బిజీగా ఉండగా, ఎంఎస్ ధోని ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. నెట్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. నిన్న టీమ్ ఇండియాను కలిసేందుకు ధోని రాంచీ స్టేడియం చేరుకున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్ రాంచీలో నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది.