కశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇవ్వండి చాలు!

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ఆటగాళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్రపోతున్న సర్ఫరాజ్‌ను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది పాక్ ఫ్యాన్స్ అయితే.. ‘తమకు కశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇవ్వండి చాలు’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. భారత్ టీం కోహ్లీ కెప్టెన్సీలో సూపర్ ఫామ్‌లో ఉందని.. అందుకే కోహ్లీని […]

కశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇవ్వండి చాలు!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jun 18, 2019 | 7:14 PM

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ఆటగాళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్రపోతున్న సర్ఫరాజ్‌ను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కొంతమంది పాక్ ఫ్యాన్స్ అయితే.. ‘తమకు కశ్మీర్ వద్దు.. కోహ్లీని ఇవ్వండి చాలు’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు. భారత్ టీం కోహ్లీ కెప్టెన్సీలో సూపర్ ఫామ్‌లో ఉందని.. అందుకే కోహ్లీని మాకు ఇచ్చేయండి అంటూ ప్రతిపాదనలు చేస్తున్నారు.