PAK vs IND Final: టాస్ ఓడిన భారత్.. డబ్యూసీఎల్ ట్రోఫీ తొలి విజేత ఎవరో?
Pakistan Champions vs India Champions, Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (World Championship of Legends 2024 ) ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. సెమీస్‌లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్, ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించాయి. నేడు ఇరుజట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించి భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా, వెస్టిండీస్‌పై పాక్ జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.

Pakistan Champions vs India Champions, Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (World Championship of Legends 2024 ) ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ లీగ్‌లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. సెమీస్‌లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్, ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించాయి. నేడు ఇరుజట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించి భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా, వెస్టిండీస్‌పై పాక్ జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో పాకిస్థాన్ భారత్‌ను ఓడించింది. యువరాజ్ సేన ఫైనల్‌లో యూనిస్ ఖాన్ జట్టుకు ఓటమిని రుచి చూడగలరా అనేది ప్రశ్నగా మారింది.
టాస్ గెలిచిన పాకిస్తాన్..
ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఛాంపియన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత ఛాంపియన్స్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమైంది.
పాకిస్థాన్ ఆటతీరు..
ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే ఒక ఓటమిని చవిచూసింది. యూనిస్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు తొలి సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌ను 20 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు టికెట్‌ను బుక్ చేసుకుంది.
టీమిండియా ప్రయాణం..
ఈ టోర్నీలో టీమిండియా నిలకడగా రాణించలేకపోయింది. లీగ్ దశలోనే మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ చేతిలో కూడా ఓడిపోయింది. అయినప్పటికీ, ఇది సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆపై ఈ జట్టు ఆస్ట్రేలియాను 86 పరుగుల భారీ తేడాతో ఓడించి ఫాంలోకి వచ్చింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
ఇండియా ఛాంపియన్స్ (ప్లేయింగ్ XI): రాబిన్ ఉతప్ప(కీపర్), అంబటి రాయుడు, సురేష్ రైనా, యువరాజ్ సింగ్(కెప్టెన్), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, అనురీత్ సింగ్.
పాకిస్థాన్ ఛాంపియన్స్ (ప్లేయింగ్ XI): కమ్రాన్ అక్మల్(కీపర్), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్(కెప్టెన్), షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, అమీర్ యామిన్, సొహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, సొహైల్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




