AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NZ: 7.3 ఓవర్లలో 8 వికెట్లు.. కెప్టెన్ కోరికతో చెలరేగిన బౌలర్.. ఆ ప్లేయర్ ఎవరంటే?

PAK vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హరీస్ రవూఫ్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతని ఆటతీరు ఫలితంగా లాహోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు లక్ష్యానికి 38 పరుగుల దూరంలో ఆగిపోయింది.

PAK vs NZ: 7.3 ఓవర్లలో 8 వికెట్లు.. కెప్టెన్ కోరికతో చెలరేగిన బౌలర్.. ఆ ప్లేయర్ ఎవరంటే?
Pak Vs Nz Haris Rauf
Venkata Chari
|

Updated on: Apr 16, 2023 | 4:50 PM

Share

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు 2-0తో అజేయంగా ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఈ రెండు విజయాల్లోనూ ఒక బౌలర్ కివీస్‌కు చుక్కలు చూపించాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బాబర్ ఆజం కోరికను నెరవేర్చి సంచలనం సృష్టించాడు. పాకిస్థాన్ తరుపున టీ20 సిరీస్‌లో అద్భుతాలు చేసిన ఈ బౌలర్ పేరు హరీస్ రవూఫ్. సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

ఈ 8 వికెట్లలో హరీస్ రవూఫ్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 4 ఓవర్లలో 27 పరుగులిచ్చాడు. అతని ఆటతీరు ఫలితంగా లాహోర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు లక్ష్యానికి 38 పరుగుల దూరంలో ఆగిపోయి, ఓటమిపాలైంది.

2 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు..

లాహోర్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 కూడా జరిగింది. ఇందులో హరీస్ రవూఫ్ 3.3 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బాబర్ అజామ్ కోరిక మేరకు తొలి మ్యాచ్‌లో హరీస్ ఈ 4 వికెట్లు తీశాడంట.

ఇవి కూడా చదవండి

నెరవేరిన బాబర్ ఆజం కోరిక..

తొలి టీ20 మ్యాచ్‌ అనంతరం హరీస్‌ రౌఫ్‌ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు బాబర్‌ అజామ్‌ తన వద్దకు వచ్చి నేటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీయాలని కోరాడని చెప్పుకొచ్చాడు. అలాగే లక్ కలసి రావడంతో.. బాబర్ కోరిక నెరవేర్చాను.

2 మ్యాచ్‌లు, 7.3 ఓవర్లు, 8 వికెట్లు..

ఇప్పుడు టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల ఓవర్లు, వికెట్లను జోడిస్తే.. హరీస్ రవూఫ్ కేవలం 7.3 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టినట్లైంది. అంటే మొదటి రెండు మ్యాచ్‌లతో సహా, అతని ఎకానమీ కేవలం 6 మాత్రమే కావడం గమనార్హం.

ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా, హారిస్ ఇప్పుడు తన T20I అరంగేట్రం నుంచి 80 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు చెందిన వనిందు హసరంగాను వెనక్కునెట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..