PAK vs BAN: పాక్‌‌ను రఫ్పాడించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌గా ఎంపిక.. అవార్డ్‌ని రిక్షా పుల్లర్‌కి అంకితమిచ్చి హీరోగా మారాడు

PAK vs BAN: పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మెహదీ హసన్ బంతితో, బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు. మెహదీ హసన్ తనకు లభించిన ప్రైజ్ మనీ మరియు అవార్డును బంగ్లాదేశ్ హింసలో మరణించిన విద్యార్థులకు మరియు రిక్షా పుల్లర్‌కు అంకితం చేశారు.

PAK vs BAN: పాక్‌‌ను రఫ్పాడించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌గా ఎంపిక.. అవార్డ్‌ని రిక్షా పుల్లర్‌కి అంకితమిచ్చి హీరోగా మారాడు
Mehedi Hasan Miraz
Follow us

|

Updated on: Sep 04, 2024 | 1:15 PM

PAK vs BAN: పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో విజయం సాధించింది. తొలిసారిగా బంగ్లాదేశ్‌ పాక్‌పై టెస్టు సిరీస్‌ గెలవడమే కాకుండా క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న బంగ్లాదేశ్ ఈ విజయానికి మెహదీ హసన్ హీరోగా నిలిచాడు. మెహ్దీ హసన్ బాల్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసి బంగ్లాదేశ్‌కు టెస్ట్ సిరీస్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన తర్వాత, మెహదీ హసన్‌కు 5 లక్షల పాకిస్తానీ రూపాయలు అంటే దాదాపు భారత కరెన్సీలో రూ. 1.5 లక్షలు బహుమతిగా అందించారు. అయితే, ఈ అవార్డును బంగ్లాదేశ్ నిరసనల్లో మరణించిన రిక్షా పుల్లర్, విద్యార్థులకు అంకితం చేశాడు.

మెహదీ హసన్ ఏం చెప్పాడు?

బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం తర్వాత మెహదీ హసన్ మాట్లాడుతూ, ‘మా దేశంలో సంక్షోభం ఉందని మీ అందరికీ తెలుసు. నిరసనల్లో మరణించిన విద్యార్థులకు నా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అంకితం చేస్తున్నాను. ఆ నిరసనల్లో ఒక రిక్షా పుల్లర్ కూడా గాయపడి మరణించాడు. ఆయనకు నా అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి

మెహదీ హసన్ కెరీర్..

బంగ్లాదేశ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ 2 మ్యాచ్‌ల్లో 155 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. బంగ్లాదేశ్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మెహ్సీ హసన్ ఈ పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 77.50 బౌలింగ్‌లో మెహదీ హసన్ ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. ఈ ఆటగాడు 2 టెస్టుల్లో 10 వికెట్లు తీశాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా సాధించాడు. బంగ్లాదేశ్ ట్రబుల్ షూటర్ తానేనని మెహదీ హసన్ చూపించాడు. జట్టుకు అవసరమైనప్పుడు తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు మెహదీ హసన్‌కి అసలు పరీక్ష భారత పర్యటన ద్వారా రానుంది. బంగ్లాదేశ్‌ జట్టు కూడా భారత పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..