On This Day: 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. ప్రపంచ ఛాంపియన్‌గా టీమిండియా.. కట్ చేస్తే.. ఇప్పుడు ఐపీఎల్‌లో శత్రువులుగా.!

|

Apr 02, 2024 | 1:03 PM

World Cup 2011: భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన 11 మంది ఆటగాళ్లలో ముగ్గురు IPL 2024 లో కూడా ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ, కోహ్లీ , గంభీర్‌లు ముఖాముఖిగా తలపడ్డారు. ఆటగాళ్లుగా ధోనీ, కోహ్లీ, మెంటార్‌గా గంభీర్‌లు సవాల్‌ విసురుకుంటున్నారు. ఐపీఎల్ 17వ సీజన్ 2011 ప్రపంచకప్ కెప్టెన్ ధోనీ, కోహ్లిల మధ్య పోరుతో ప్రారంభమైంది. ఎంఎస్ ధోనీతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో కోహ్లితో కూడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆ తర్వాత బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

On This Day: 13 ఏళ్ల క్రితం ఇదే రోజు.. ప్రపంచ ఛాంపియన్‌గా టీమిండియా.. కట్ చేస్తే.. ఇప్పుడు ఐపీఎల్‌లో శత్రువులుగా.!
World Cup 2011
Follow us on

World Cup 2011: 2 ఏప్రిల్ 2011.. ఆ రోజు మొత్తం భారతదేశ క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా ముగింపు పలికింది. సరిగ్గా 13 ఏళ్ల క్రితం, వాంఖడే మైదానంలో ఎంఎస్ ధోని సిక్సర్ కొట్టిన వెంటనే.. దేశం మొత్తం దీపావళి, హోలీ పండుగలను ఏకకాలంలో సెలబ్రేట్ చేసుకుంది. దేశమంతా అర్థరాత్రి వీధుల్లో సంబరాలు చేసుకుంది. ఏప్రిల్ 2, 2011న శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఎంఎస్ ధోనీ తన కెప్టెన్సీలో భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు.

విరాట్ కోహ్లీ , హర్భజన్ సింగ్‌లతో సహా మిగతా ఆటగాళ్లందరూ సచిన్ టెంభాడూల్కర్‌ను తమ భుజాలపై ఎక్కించుకుని, స్టేడియం మొత్తం తిప్పారు. ఆ ఫైనల్‌కు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఫైనల్లో భారత్ తరపున పోరాడిన 11 మంది ఆటగాళ్లలో చాలా మంది రిటైరయ్యారు. ఆ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక ఆటగాడు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఆడుతున్నాడు. ఆ ఆటగాడి పేరు విరాట్ కోహ్లీ. ఆ జట్టు కెప్టెన్ ధోనీ కూడా ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నాడు. కానీ, ఇప్పుడు అతను ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం లీగ్‌లో బిజీగా ఉన్నాడు. ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు.

ఇవి కూడా చదవండి

ముగ్గురు ఆటగాళ్ల ఘర్షణ..

భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన 11 మంది ఆటగాళ్లలో ముగ్గురు IPL 2024 లో కూడా ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోనీ, కోహ్లీ , గంభీర్‌లు ముఖాముఖిగా తలపడ్డారు. ఆటగాళ్లుగా ధోనీ, కోహ్లీ, మెంటార్‌గా గంభీర్‌లు సవాల్‌ విసురుకుంటున్నారు.

ఐపీఎల్‌లో ఎవరు ఎవరిపై విజయం సాధించారు..

ఐపీఎల్ 17వ సీజన్ 2011 ప్రపంచకప్ కెప్టెన్ ధోనీ, కోహ్లిల మధ్య పోరుతో ప్రారంభమైంది. ఎంఎస్ ధోనీతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో కోహ్లితో కూడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఆ తర్వాత బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2011 ప్రపంచకప్ స్టార్ గంభీర్ KKR మెంటార్. ముగ్గురు ప్రపంచ ఛాంపియన్‌లు ఇప్పుడు తమ తమ జట్లను IPL ఛాంపియన్‌లుగా మార్చడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

2011 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్: ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ఎస్ శ్రీశాంత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..